IMD Red Alert : ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో దాదాపు 20 చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సీయస్, నజఫ్‌గఢ్‌లో 46.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మరో నాలుగు రోజుల పాటు ఉత్తరాదిలో వేడి గాలులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ (IMD Red Alert) తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
వచ్చే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు సాయంత్రంకల్లా దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఏడు రోజుల్లో కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫాను తరహా వాతావరణం ఏర్పడుతుందని ఐఎండీ పేర్కొంది. రాబోయే ఏడు రోజులు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
Also Read : Mega Food Park : రాష్ట్రంలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ రెడీ .. ఎక్కడ ?
తెలంగాణలో..
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, నారాయణపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడేటప్పుడు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.