MLC Kavitha : లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున కవిత రిమాండ్ గడువును పొడిగించాలని ఇవాళ విచారణ సందర్భంగా కోర్టును ఈడీ అధికారులు కోరారు. ఈ కేసులో ఇప్పటికే తాము 8వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేశామని, దానిపై విచారణ జరగాల్సి ఉందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈడీ విజ్ఞప్తి మేరకు కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈనెల 20న సప్లిమెంటరీ ఛార్జిషీట్‌పై నిర్వహిస్తామని కోర్టు తెలిపింది. వాస్తవానికి ఈరోజుతో కవిత జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగిసింది. దీంతో ఇవాళ ఉదయం విచారణ కోసం కవితను తిహార్ జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తుల ఎదుట హాజరుపరిచారు.
Also Read :Modi Nomination: మోడీ నామినేషన్ సమయంలో ఉన్న ఆ నలుగురు ఎవరు ?
ఈడీ తాజాగా కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖుల పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఛన్‌ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అర్వింద్ సింగ్ పాత్రను ఇందులో ప్రస్తావించినట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరని లాయర్లు వాదించినా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మహిళగా పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత కవితకు ఉందని ఆమె తరఫు లాయర్లు వాదించినా ఫలితం లేకుండాపోయింది. ఎందుకంటే.. కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈడీ వాదించింది. అందుకే కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల నిరాకరించింది.