Site icon HashtagU Telugu

Delhi Liquor : క‌విత అరెస్ట్ కు రంగం సిద్ధం! BRS, YCP లిక్క‌ర్ స్కామ్ లింకులు!

Delhi Liquor

Delhi Liquor Cbi

`లిక్క‌ర్ క్వీన్` గా ప్రత్య‌ర్థి పార్టీల నుంచి వ్యంగ్యాస్త్రాల‌ను వింటోన్న క‌ల్వ‌కుంట్ల క‌విత (Delhi Liquor) అరెస్ట్ కు రంగం సిద్ద‌మ‌వుతోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఆమెను పేర్కొంటూ చార్జిషీట్లను సీబీఐ త‌యారు చేసింది.  తాజాగా ఆమెకు మ‌రోసారి సీబీఐ నోటీసులు(CBI Notice) ఇవ్వ‌డంతో అరెస్ట్ ఖాయ‌మ‌ని వినిపిస్తోంది. గ‌త కొంత కాలంగా ఆల‌స్యంగా విచార‌ణ జరుగుతోన్న ఈ కేసు వెనుక రాజ‌కీయ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావించాయి. అంతేకాదు, క‌విత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఆమెకు సీబీఐ నోటీసులు ఇవ్వ‌డంతో క‌విత భ‌విష్య‌త్ పై బీఆర్ఎస్ వ‌ర్గాల్లోనే కాదు, ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది.

లిక్క‌ర్ క్వీన్`  క‌ల్వ‌కుంట్ల క‌విత అరెస్ట్..? (Delhi Liquor) 

ఒక వైపు ఈడీ మ‌రో వైపు సీబీఐ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ (Delhi Liquor) ను నిగ్గు తేల్చ‌నుంది. ఆ క్ర‌మంలో నాలుగు రోజుల క్రితం క‌విత ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసిన విష‌యం విదిత‌మే. ఇటీవ‌ల క‌విత‌కు వ్య‌క్తిగ‌త స‌హాకునిగా ఉన్న బోయిన‌ప‌ల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఏపీ రాష్ట్రంలోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘ‌వ‌ను తాజాగా సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక ఇప్పుడు క‌విత వంతు మాత్ర‌మే మిగిలి ఉంద‌ని ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ఇటీవ‌ల ఆమెను సీబీఐ  హైద‌రాబాద్ లోని ఆమె ఇంటిలో ప్ర‌శ్నించింది. ఆ రోజు ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు విచారణ చేసిన సీబీఐ ప్ర‌ధానంగా ఆమె వాడిన మొబైల్ సిమ్ కార్డుల మీద దృష్టి పెట్టింది. వాటి ద్వారా ఎవరెవరితో  క‌విత లాబీయింగ్ న‌డిపారు? అనే దానిపై ఒక నిర్థార‌ణ కు వ‌చ్చింది.

Also Read : Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్ట్

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తో అటు ఆప్ ఇటు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ కార్న‌ర్ చేస్తుందంటూ ఇటీవ‌ల ఆ పార్టీల లీడ‌ర్లు గ‌గ్గోలు పెట్టారు. అంతేకాదు, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్ల‌ను టార్గెట్ చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ఈడీ, బోడీ ఏమీ చేయ‌లేవంటూ క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఇటీవ‌ల వ‌ర‌కు అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట హూంక‌రించారు. మ‌రోసారి క‌విత‌కు సీబీఐ నోటీసులు (CBI Notice) జారీ చేయ‌డంతో ఆ పార్టీలో అల‌జ‌డి ప్రారంభం అయింది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసే రోజు ఈ నోటీసులు రావ‌డం బీఆర్ఎస్ కు ద‌డ‌పుట్టిస్తున్నాయి. నోటీసుల‌ను అందుకున్న క‌విత వెంట‌నే మండ‌లి స‌మావేశాల్లో ఉన్న మంత్రి కేటీఆర్ వ‌ద్ద‌కు వెళ్లారు. అన్నా, చెల్లెలు ఈ నోటీసుల గురించి చ‌ర్చించుకున్నార‌ని తెలుస్తోంది.

మాగుంట రాఘ‌వ‌తో క‌విత వ్యాపార లావాదేవీలకు ఆస్కారం..(Notice)

ఏపీలోని ఎంపీ మాగుంట కుమారుడు రాఘ‌వ లిక్క‌ర్ కంపెనీల‌తో స‌న్నిహితంగా ఉంటారు. కొన్ని సంవ‌త్స‌రాలుగా మాగుంట కుటుంబం లిక్క‌ర్ తయారీ కంపెనీల‌ను నడుపుతోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా ఉండే కంపెనీల‌తో సాన్నిహిత్యం ఉంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొంద‌రు అనుచ‌రులు, కుటుంబీకులు, స‌న్నిహితులు క‌ల్వ‌కుంట్ల కుటుంబంతో క‌లివిడిగా మెలుగుతున్నారు. వ్యాపారాల‌ను విస్త‌రింప చేసుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే మాగుంట రాఘ‌వ‌తో క‌విత వ్యాపార లావాదేవీలకు (Delhi Liquor) ఆస్కారం ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. అంతేకాదు, తాడేప‌ల్లి కోట‌రీకి కూడా ఈ ఎపిసోడ్ తో సంబంధాలున్నాయ‌ని టీడీపీ ప‌దేప‌దే చెబుతోంది. ఒకానొక స‌మ‌యంలో వైఎస్ భార‌తిని కూడా ఈ లిక్క‌ర్ స్కామ్ లోకి టీడీపీ లీడ‌ర్లు లాగారు. కానీ, మాగుంట రాఘ‌వ‌ను అరెస్ట్ చేయ‌డం వ‌ర‌కు ప్ర‌స్తుతానికి సీబీఐ (CBI Notice) ప‌రిమితం అయింది.

Also Read : Delhi Liquor Scam : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ వెల్ల‌డి

ఏపీలో ప్ర‌స్తుతం లిక్క‌ర్ డిస్ట్రిల‌రీలు దాదాపుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌రీ కింద ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. ఆ కోట‌రీ కంపెనీలు దేశ వ్యాప్తంగా లిక్క‌ర్ ను స‌ర‌ఫ‌రా చేస్తున్నాయ‌ని టీడీపీ చెబుతోంది. కొన్ని చోట్ల లాబీయింగ్ చేస్తూ వ్యాపారాన్ని ఆ కంపెనీలు విస్త‌రింప చేశాయ‌ని ఆరోప‌ణ‌. దేశ వ్యాప్తంగా విస్త‌రించిన ఈ మాఫియా వ్య‌వ‌హారం ఢిల్లీ కేంద్రంగా  బ‌య‌ట‌ప‌డిన విషయం విదిత‌మే. ఇక రాజ‌కీయంగా బీఆర్ఎస్, వైసీపీ పార్టీల‌ను వేర్వేరుగా చూడ‌లేం. ఆ రెండు పార్టీల లీడ‌ర్లు కొంద‌రు హైద‌రాబాద్, బెంగుళూరు, విశాఖ, ఢిల్లీ కేంద్రంగా ప‌లు వ్యాపారాలు చేస్తున్నార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌ర‌చూ చేసే ఆరోప‌ణ‌. ప్ర‌ధానంగా రియ‌ల్ ఎస్టేట్, లిక్క‌ర్ వ్యాపారాల‌తో పాటు విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే కొన్ని ర‌కాల వ్యాపారాల‌ను కూడా ఈ రెండు పార్టీల్లోని కొంద‌రు లీడ‌ర్లు టీమ్ గా ఏర్ప‌డి చేస్తున్నార‌ని టీడీపీ చెబుతోంది. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని కూడా ఒకానొక సంద‌ర్భంలో టీడీపీ బ‌య‌ట పెట్టింది. ఇప్పుడు లిక్క‌ర్ స్కామ్ మాత్రం క‌విత మెడ‌కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది.

ఢిల్లీలో విచారించ‌డానికి సీబీఐ 

హైద‌రాబాద్ లోని సొంత ఇంటిలో క‌విత‌ను విచారించిన సీబీఐ ఈసారి ఢిల్లీకి పిలిపిస్తుంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నాయి. అక్క‌డే ఆమెను ఆరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. తొలిసారి ఆమెను విచార‌ణ‌కు పిలిచిన సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడ‌ర్ నిర‌స‌న‌ల‌కు దిగింది. సీబీఐ విచారించే ప్రాంతానికి పెద్ద ఎత్తున క్యాడ‌ర్ త‌ర‌లి వెళ్లింది. అలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా ఈసారి క‌విత‌ను ఢిల్లీలో విచారించ‌డానికి సీబీఐ(CBI Notice) సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది.

Also Read : Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట‌!!