Delhi Liquor : క‌విత మ‌రో క‌నిమొళి కాదు..డాట‌ర్ ఆఫ్ ఫైట‌ర్‌!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ (Delhi Liquor) విచార‌ణ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతుందా? కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆధారాల‌ను చూప‌లేక‌పోతున్నాయా?

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 04:56 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ (Delhi Liquor) విచార‌ణ క్ర‌మంగా బ‌ల‌హీన‌ప‌డుతుందా? కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆధారాల‌ను చూప‌లేక‌పోతున్నాయా? ఏమీ లేకుండానే బీజేపీ రాద్ధాంతం చేస్తుందా? కేసీఆర్ కుమార్తె క‌విత(Kavitha) తిరుగులేని నాయ‌కురాలిగా గుర్తింపు పొందిన‌ట్టేనా? అందుకు. లిక్క‌ర్ స్కామ్ విచార‌ణ ఉప‌యోగప‌డిందా? కేసీఆర్ బీజేపీ మీద జాతీయ స్థాయిలో గెలిచిన‌ట్టేనా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఎన్నో ఇప్పుడు వినిపిస్తున్నాయి. అవ‌న్నీ నిజ‌మే అనేలా ఢిల్లీ సీబీఐ కోర్టు కామెంట్స్ ఉండ‌డం విశేషం.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్  విచార‌ణ(Delhi Liquor) 

తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల‌ను కొన్ని రోజుల పాటు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్(Delhi Liquor) ఊపేసింది. ఇదిగో క‌విత అరెస్ట్ అదిగో తీహార్ జైలు అంటూ ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది. అటు సీబీఐ ఇటు ఈడీ రెండూ విచార‌ణ చేసిన‌ప్ప‌టికీ ఆమె మీద ఒక ఆరోప‌ణ‌ను కూడా నిరూపించ‌లేక‌పోయాయి. మూడో చార్జిషీట్ లోనూ ఆమె(Kavitha) పేరు క‌నిపించ‌లేదు. కానీ, అనుబంధ చార్జిషీట్ లో మాత్రం క‌విత భ‌ర్త అనిల్ పేరును పొందుప‌రిచారు. దీంతో క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ఆయ‌న్ను విచారిస్తార‌ని, అరెస్ట్ చేస్తార‌ని సరికొత్త ప్ర‌చారానికి బీజేపీ తెర‌లేపింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ అంతా తూచ్ అంటూ కోర్టు వ్యాఖ్యానించింద‌ని

ఉప ఎన్నిక‌లు, గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల(Kavitha) కుటుంబం మొత్తం జైలుకే అంటూ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌చారం చేశారు. ప్ర‌భుత్వం కూలిపోతుంద‌ని రెండేళ్ల క్రితం రాజ‌కీయ వేదిక‌ల‌పై ప‌లుమార్లు చెప్పారు. కొంద‌రు నిజ‌మేన‌ని భావించారు. కానీ, కాంగ్రెస్ మాత్రం తొలి నుంచి బీఆర్ఎస్, బీజేపీ గేమంటూ చెబుతూనే ఉంది. అదే నిజ‌మ‌ని ఇప్పుడు ఢిల్లీ సీబీఐ  కోర్టు చేసిన కామెంట్స్ ఆధారంగా భావించాల్సి వ‌స్తోంది. మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగింద‌ని చెబుతోన్న ఈడీ ఒక ఆధారాన్ని కూడా చూప‌లేక‌పోయింది. క‌నీసం ఒక హ‌వాలా ప్రొవైడ‌ర్ పేరు కూడా కాగితం మీద పెట్ట‌లేక‌పోయింది. ఢిల్లీ లిక్క‌ర్ (Delhi Liquor)విధానంలో ఎక్క‌డ లావాదేవీలు జ‌రిగాయ‌ని కోర్డులో ఈడీ ప్రూ చేయ‌లేక‌పోయింది.

ఢిల్లీ సీబీఐ  కోర్టు చేసిన కామెంట్స్ ఆధారంగా(Delhi Liquor)

లంచం లేదా కిక్‌బ్యాక్ కోసం నగదు మారిన దానిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆధారాలు చూపలేక‌పోవ‌డంతో రాజేష్ జోషి , గౌతమ్ మల్హోత్రాలకు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విష‌యం విదిత‌మే. దీంతో లిక్క‌ర్ స్కామ్(Delhi Liquor) అంతా అబ‌ద్ధ‌మ‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియా ముందుకొచ్చారు. , మనీలాండరింగ్ కేసులో ఇద్దరిపై ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని కోర్టు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. కానీ, బీజేపీ మాత్రం బెయిల్ వ‌చ్చినంత మాత్రాన స్కామ్ లేన‌ట్టు కాద‌ని ఇప్ప‌టికీ చెబుతోంది. సీబీఐ కోర్టు చేసిన కామెంట్స్ తో క‌వితతో (Kavitha)పాటు సౌత్ గ్రూప్ కు రిలీఫ్ వ‌చ్చింది. ఆ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆడిట‌ర్ బుచ్చిబాబు, మాగుంట రాఘ‌వ‌రెడ్డి, హెటిరో డ్ర‌గ్స్ శ‌ర‌శ్చంద్రారెడ్డి త‌దిత‌రుల‌కు ఊప‌రిపీల్చుకున్న‌ట్టు అయింది. అంతేకాదు, శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న శ‌ర‌శ్చంద్రారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఫ‌లితంగా క‌విత అరెస్ట్ ఇక లేన‌ట్టేన‌ని బీఆర్ఎస్ ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తోంది.

Also Read : Delhi Liquor Scam: భార్య అనారోగ్యం కారణంగా సిసోడియా బెయిల్ పిటిషన్

గ‌త ఏడాది నుంచి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్(Delhi Liquor) ను చూపుతూ క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని బీజేపీ తెలంగాణ విభాగం యాగీ ప‌ట్టించింది. దానికి తోడుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కేసీఆర్ కుటుంబం స్కామ్ ల గురించి మాట్లాడుతూ అరెస్ట్ త‌ప్ప‌ద‌ని బ‌హిరంగ వేదిక‌ల‌పై చెప్పారు. అందుకు అనుగుణంగా తొలుత సీబీఐ విచార‌ణ‌కు దిగింది. ఇంటి వ‌ద్ద క‌విత‌ను(Kavitha) అమె చెప్పిన తేదీన హైద‌రాబాద్ కు వ‌చ్చిన విచార‌ణ చేసింది. ఆ రోజు ప్ర‌త్య‌ర్థులు అనుమానించారు. అదంతా బీజేపీ, బీఆర్ఎస్ గేమ‌ని కాంగ్రెస్ చెప్పింది. త‌ద‌నంత‌రం ఈడీ క‌విత‌ను ఢిల్లీకి పిలిచింది. ఆమె తొలుత రాలేన‌ని చెప్ప‌డంతో కొంత వెసుల‌బాటును ఇచ్చింది. ఆ త‌రువాత ధైర్యం నూరిపోసి నింపాదిగా క‌విత‌ను ఢిల్లీ పంపారు కేసీఆర్. మూడు రోజులు ఈడీ విచార‌ణ చేసిన‌ప్ప‌టికీ క‌విత చ‌లాకీగా క‌నిపించారు. అంటే, నాన్ సీరియ‌స్ గా విచార‌ణ సాగింద‌ని కాంగ్రెస్ అప్పుడే అనుమానించింది. సీన్ క‌ట్ చేస్తే, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ అంతా తూచ్ అంటూ కోర్టు వ్యాఖ్యానించింద‌ని కేజ్రీవాల్ చెప్ప‌డం క‌విత‌ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని రాజ‌కీయంగా మ‌రో మెట్టుకు ఎక్కిన‌ట్టు అయింది.

Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాములో సంచలనం: అప్రూవర్ గా మారిన కవిత మాజీ ఆడిటర్