Delhi Deals : తెలంగాణ‌లో డ్ర‌గ్స్ కేసు, ఢిల్లీలో మంత్రి కేటీఆర్!

తెలంగాణ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఢిల్లీ బీజేపీ (Delhi Deals)వ‌ర‌కు వెళ్లింది .సెల‌బ్రిటీలు,కొంద‌రు నాయ‌కులు ఈ కేసులోఉన్న‌ట్టు బ‌య‌ట‌కు వస్తోంది.

  • Written By:
  • Updated On - June 24, 2023 / 05:36 PM IST

తెలంగాణ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఢిల్లీ బీజేపీ (Delhi Deals)వ‌ర‌కు వెళ్లింది . సెల‌బ్రిటీలు, కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఈ కేసులో ఉన్న‌ట్టు ప్రాథ‌మికంగా బ‌య‌ట‌కు వస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలోనూ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం హైద‌రాబాద్ ను చుట్టుముట్టింది. బెంగుళూరు, ముంబాయ్ పోలీసులు కూడా భాగ్య‌న‌గ‌రం వైపు వేలెత్తి చూపారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న‌లుగురు ఎమ్మెల్యేలు అప్ప‌ట్లో డ‌గ్స్ కేసులో ఉన్నార‌ని బెంగుళూరు పోలీసులు విచార‌ణ దిగారు. అక్క‌డి ప‌బ్ కు త‌ర‌చూ వెళ్లే వాళ్ల జాబితాను కూడా సూచాయ‌గా బ‌య‌ట పెట్టింది.

తెలంగాణ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఢిల్లీ బీజేపీ వ‌ర‌కు(Delhi Deals)

ముంబాయ్ డ్ర‌గ్స్ కేసులోనూ హీరోయిన్ ర‌కూల్ ప్రీత్ సింగ్ ద్వారా తెలంగాణ‌కు సంబంధించిన కీల‌క లీడ‌ర్ల గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని అప్ప‌ట్లోని టాక్‌. ఆ త‌రువాత బెంగుళూరు, ముంబాయ్ కేసులు విచార‌ణ ఆల‌స్యం జ‌రిగింది. రాజ‌కీయ‌ప‌ర‌మైన లైజ‌నింగ్ జ‌రిగింద‌ని ప్ర‌త్య‌ర్థులు ఆరోపించారు. ఆ స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు(Delhi Deals) రెండుసార్లు వెళ్లారు. ఒక‌సారి నెల రోజుల పాటు అక్క‌డే ఉన్నారు. రెండోసారి 15 రోజుల పాటు హ‌స్తిన‌లోనే మ‌కాం వేశారు. మ‌రోసారి మూడు రోజుల పాటు ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే డ్రగ్స్ కేసుల‌కు సంబంధించిన విచార‌ణ జ‌రిగింది. ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, డ‌గ్స్ కేసుల విచార‌ణ‌కు ముడిపెడుతూ విప‌క్షాలు ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌ల‌కు దిగ‌డం గతంలో చూశాం.

టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ‌గ్స్ కేసులో అరెస్ట్

ప్ర‌స్తుతం డ‌గ్స్ వ్య‌వ‌హారం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. విచారణలో ఆయ‌న ఫోన్ నుంచి అనేక మంది సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఫోన్లు వెళ్లిన‌ట్టు తేలింద‌ని టాక్‌. ఆయ‌న వ‌ద్ద‌ కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కస్టడీలో అనేక అంశాలు బయటికి వచ్చినట్టు తెలిసింది. గ‌త ఎన్నిక‌లకు ముందు కూడా ఇలాగే టాలీవుడ్ సెల‌బ్రిటీలు, కొంద‌రు హీరోల‌ను కూడా తెలంగాణ సిట్ విచార‌ణ చేసింది. వాళ్ల నుంచి గోళ్లు, వెంట్రుక‌ల న‌మూనాల‌ను తీసుకొంది. టాలీవుడ్ పెద్ద‌ల కుటుంబీకులు, రాజ‌కీయ నేత‌ల ప్ర‌మేయం ఉంద‌ని విచార‌ణ‌లో తేలింది. ఆ కేసును 2018 అసెంబ్లీ ఎన్నిక‌లు త‌రువాత ఒక్క‌సారిగా క్లోజ్ చేశారు. హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ మూలాలు లేవ‌ని ఎక్సైజ్ శాఖ‌తో పాటు ఏర్ప‌డిన సిట్ తేల్చేసింది.

కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న యాదృశ్చికం కాద‌ని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి థాక్రే

డ్ర‌గ్స్ విచార‌ణ‌కు సంబంధించిన ఫైల్స్ ను అందించాల‌ని తెలంగాణ హైకోర్టు ప‌లుమార్లు ప్ర‌భుత్వాన్ని అడిగింది. కానీ, ఆ ఫైల్స్ ఫైర్ యాక్సిటెంట్ లో కాలిపోయాయ‌ని కోర్టుకు ఆల‌స్యంగా తెలిపింది. దీంతో హైకోర్టు సీరియ‌స్ అయింది. కేసు మాత్రం శాశ్వ‌తంగా క్లోజ్ అయింది. ఇప్పుడు కొత్త‌గా మ‌రో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌చ్చింది. టాలీవుడ్ సెల్ర‌బిటీల ప్ర‌మేయం ఉంద‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిసింది. గ‌త ఎన్నిక‌లకు ముందుగా ఎలా అయితే, డ్ర‌గ్స్ కేసును తెర‌మీద‌కు తెచ్చారో, అలాగే ఇప్పుడు కూడా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం వ‌చ్చింది. ఇలాంటి స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్ల‌డం(Delhi Deals) అనుమానాల‌కు దారితీస్తోంది. పైగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేయ‌డం అనుమానాల‌కు బ‌లం చేకూరుస్తోంది.

Also Read : KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!

విప‌క్షాల ప‌ట్నా మీటింగ్ జ‌రిగే రోజే మంత్రి కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న (Delhi Deals) పెట్టుకోవ‌డం యాదృశ్చికం కాద‌ని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి థాక్రే అంటున్నారు. వ్యూహాత్మ‌కంగా బీజేపీ, బీఆర్ఎస్ పెట్టుకున్న కార్య‌క్ర‌మం కింది ప‌రిగ‌ణిస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, బీజేపీ క‌లిసి ప‌నిచేస్తాయ‌ని చెబుతున్నారు. రాజ‌కీయ కోణం నుంచి మంత్రి కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను థాక్రే చూస్తున్నారు. కానీ, డ‌గ్స్ కేసు విచార‌ణ జ‌రుగుతోన్న సంద‌ర్భంలో కేటీఆర్ హ‌స్తిన వెళ్ల‌డం మ‌రో విధంగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు, బీజేపీకి సంబంధించిన కీల‌క లీడ‌ర్లు కూడా ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని కూడా హ‌డావుడిగా ఢిల్లీకి బీజేపీ పెద్ద‌లు పిలిపించుకున్నారు. ఇదంతా చూస్తుంటే, ఏదో జ‌ర‌గ‌బోతుంద‌ని అనుమానం క‌లుగుతోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత పేరు వినిపించిన‌ప్పుడు కేసీఆర్ హ‌స్తిన లో క‌నిపించారు. ఇప్పుడు డ‌గ్స్ కేసు రావ‌డంతో కేటీఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్క‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. అప్ప‌ట్లో బీజేపీ, బీఆర్ఎస్ స‌న్నిహితంగా ఉండేవి. ఇప్పుడు గ్యాప్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న అత్యంత కీల‌కంగా మారింది.

Also Read : KCR and Modi relation : విప‌క్షాల మీటింగ్ కు `నో ఇన్విటేష‌న్‌`, BJP బీ టీమ్ గా BRS కు ముద్ర‌!