Site icon HashtagU Telugu

Delhi Deals : సోనియా చెప్పింది నిజ‌మైతే.. రేవంత్ ఔట్

Delhi Deals

Delhi Deals

జాతీయ పార్టీల‌కు ఢిల్లీ పీఠం(Delhi Deals) ముఖ్యం. రాష్ట్రాలు (State PCC )సెకండ‌రీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే, ఆయా రాష్ట్రాల్లోని పార్టీల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి కాంగ్రెస్ దూకుతోంది. ఆ విష‌యాన్ని మాజీ అధ్యక్ష‌రాలు సోనియాగాంధీ తెగేసి చెప్పారు. గ‌తంలోనూ ఇలాంటి అంశాన్ని రాయ్ పూర్ కేంద్రంగా కాంగ్రెస్ చెప్పింది. ఆ సంద‌ర్భంగా తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లోని ఈక్వేష‌న్లు ఏమిటి అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అయింది. అంటే, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అలాంటి సంద‌ర్భంలో ప్రాంతీయ పార్టీల‌తో క‌లిస్తే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని స్థానిక నేత‌ల అభిప్రాయం.

జాతీయ పార్టీల‌కు ఢిల్లీ పీఠం ముఖ్యం(Delhi Deals) 

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితిని సోనియా స్టేట్మెంట్ కు (Delhi Deals) ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చు. ఆమె మంగ‌ళ‌వారం చేసిన కామెంట్స్ ప్ర‌కారం భావ‌సారూప్య‌త ఉన్న పార్టీల‌తో క‌లిసి కాంగ్రెస్ ప‌నిచేస్తుంది. అంటే, బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న పార్టీలు ఏమైనాగానీ, వాటితో క‌లిసి ప‌నిచేస్తుంద‌ని అర్థం. ఎలాగూ క‌మ్యూనిస్ట్ లు ఎప్పుడూ బీజేపీకి వ్య‌తిరేకంగా ఉంటాయి. వాటితో పాటు బీజేపీ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్. అంటే, ఆ పార్టీతో కాంగ్రెస్(State PCC) ప‌నిచేస్తుంద‌ని అర్థం.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబితే

ఒక వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉంటే పీసీసీ(State PCC) చీఫ్ రేవంత్ రెడ్డి గుడ్ బై చెబుతారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ఆయ‌న మీడియాముఖంగా తెగేసి చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేక‌పోయిన‌ప్ప‌టికీ ఢిల్లీ పీఠంపై గట్టిగా ఉంటుంది. అంటే, ఢిల్లీ పీఠం(Delhi Deals) కోసం రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌ను మార్చుకుంటోంది. త్యాగానికి సిద్ధం అవుతోంది. ఒక వేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబితే, రాబోవు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ క‌లిపి వెళ‌తాయి. అప్పుడు అధికారం బీఆర్ఎస్ పార్టీ చేతిలోకి వెళుతోంది. అందుకు ప్ర‌తిఫ‌లంగా లోక్ స‌భ స్థానాల‌ను కాంగ్రెస్ అత్య‌ధికంగా పొందుతుంది. అవి, ఢిల్లీ పీఠాన్ని చేరుకోవ‌డానికి ప‌నికివ‌స్తాయి.

Also Read : Revanth Reddy Secret Survey: గెలుపు అభ్యర్థులు పై పీసీసీ చీఫ్​ రేవంత్​ సర్వే.!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అంశం ఇప్ప‌టికిప్పుడు పుట్టింది కాదు. కాంగ్రెస్ పార్టీలోని (State PCC)తెలంగాణ సీనియ‌ర్లు కొంద‌రు బీఆర్ఎస్ తో పొత్తు అవ‌స‌రాన్ని ప‌లుమార్లు అధిష్టానం వ‌ద్ద చెప్పార‌ని ప్ర‌చారం ఉంది. దానికి బ‌లంచేకూరేలా ప్ర‌శాంత్ కిషోర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌డం ద్వారా సోనియా ఆలోచ‌నను పొత్తు దిశ‌గా మ‌ళ్లించారు. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు దిగ్విజ‌య్ సింగ్‌, జ‌య‌రాం ర‌మేష్ లాంటి వాళ్లు కూడా బీఆర్ఎస్ క‌లిసి రావాల‌ని కోరారు. లౌకిక పార్టీలు గా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు సాధ్య‌మేనంటూ ఇటీవ‌ల కోమ‌టిరెడ్డి వెంట‌క‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, మాజీ మంత్రి జానారెడ్డి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అంశాన్ని ప్ర‌స్తావించారు. అంటే, మంగ‌ళ‌వారం సోనియా చేసిన తాజా కామెంట్స్(Delhi Deals) తో పాటు వివిధ స్థాయిల్లోని కాంగ్రెస్ లీడ‌ర్లు చేసిన వ్యాఖ్య‌ల ఆధారంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తును కొట్టిపారేయ‌లేం. అదే జ‌రిగితే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

Also Read : Sonia Gandhi: పొత్తులతోనే వచ్చే ఎన్నికలకు..సోనియా