Site icon HashtagU Telugu

Delhi Deal: ఢిల్లీ డీల్, అరెస్టులు లేనట్టే?

Delhi Deal, As If There Were No Arrests..

Delhi Deal, As If There Were No Arrests..

Delhi Deal : ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఢీల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా ను కలిసిన తరువాత అవినాష్ రెడ్డి అరెస్ట్, కవిత కేసు అంతా తూచ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. ఇలాంటి వార్తకు ఆధారాలు లేకపోలేదు. జగన్ ఢీల్లీ భేటీ తరువాత హైకోర్టు జడ్జి డేవానంద్, తెలంగాణ హైకోర్టు జడ్జి కూడా తమిళనాడు హైకోర్టు కు బదిలీ అయ్యారు. అవినాష్ రెడ్డి కేసు విచారిస్తున్న సీబీఐ అధికారి ఒకరు బదలీ జరిగింది. మూడో సారి ఈడీ సమన్లు ఇచ్చిన తరువాత కవిత అరెస్ట్ ఖాయమని చాలా మంది భావించారు. కానీ హాపీగా ఈడీ అధికారులకు చమటలు పట్టించి కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన తెలంగాణ మహిళ అంటూ బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అంటే ఇక కవిత ఢిల్లీ లిక్కర్ మరిచిపోయినట్టే. అందుకే కేసీఆర్ ఎంచక్కా దేశ వ్యాప్త బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. ఇక అవినాష్ అరెస్ట్ సుప్రీం వరకు వెళ్లినా ము దుకు కదలకుండా జగన్ ఢిల్లీ (Delhi) పర్యటన చేసిందని ఎవరిని అడిగినా చెబుతున్నారు.

అవినాష్ రెడ్డి అరెస్ట్, కవిత కేసు అంతా తూచ్ (Delhi Deal)

వివేకా కుమార్తె డాక్టర్ సునిత జగన్ ని ఎదుర్కోవడమే ఒక మహాయజ్ఞం అనుకుంటే, ఇప్పుడు మోడీ – షా లను డ్డీ కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందని సర్వత్రా వినిపిస్తుంది.

దేశంలో మోడీతో రాజీ పడిన ప్రతి రాజకీయ నాయకుడి సీబీఐ/ఈడీ/ఐటీ కేసుని అటకెక్కించిన సంఘటనలు కోకొల్లలు. అటకెక్కించడం కూడా గుట్టుచప్పుడు కాకుండా, దొడ్డి దారిలో చెయ్యలేదు. చాలా బహిరంగంగా, బాహాటంగా, బరాబర్ చేస్తాం అన్నట్లు చేశారు. ఇలాంటి వాళ్లలో జగన్ రెడ్డి, సుజనా చౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ్ రానే, ఇంకా చేంతాడంత పొడుగు లిస్ట్ ఉంది.

వివేకానంద రెడ్డి హత్య కేసుకి ఈ వారం చాలా కీలకం. నాలుగు వారాల క్రితం అరెస్ట్ చెయ్యాల్సిన అవినాష్ రెడ్డిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చెయ్యలేదు. పోయిన వారం హై కోర్టు అడ్డంకి తొలిగినా ఈ వారం ఏమీ జరగలేదు. ఇక వచ్చే వారం కూడా ఏమీ జరగకపోతే, ఇతర కేసుల లాగానే, ఈ కేసూ నిర్వీర్యం అయిపోతున్నట్లె.

Also Read : YS Viveka Murder : జస్టిస్ ఫర్ వివేకా అంటూ టీడీపీ అధినేత ట్వీట్‌.. వివేక మ‌ర‌ణించి నేటికి నాలుగేళ్లు

ఇంకొక పక్క సుప్రీం కోర్టు పోయిన వారం చాలా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. కేసు ఎందుకు ఆలస్యం అవుతుంది, విచారణాధికారి రామ్ సింగ్ ని ఎందుకు తొలగించకూడదు అని అడిగింది. అయితే సుప్రీం కోర్టులో కేసు వేసింది నిందితుడైన శంకర్ రెడ్డి భార్య. కేసు కొలిక్కి వస్తే జైలుకి పొయ్యే అవకాశం ఉన్న వ్యక్తి, కేసు కాస్త తొందరగా ముగించండి అని కేసు వెయ్యడం ఒక విడ్డూరం. అయితే, సుప్రీం కోర్టు దానికి అనుకూలమా అన్నట్టు కేసు ఆలస్యం చేస్తున్న విచారణాధికారిని ఎందుకు బదిలీ చెయ్యొద్దో చెప్పండి అని అడగటం గమనార్హం.

అసలు ఈ కేసు ఇంత దూరమన్నా రావడానికి మొదటి కారణం డాక్టర్ సునీత, రెండవ కారణం రామ్ సింగ్. ఆయన్నే కేసు నుంచి ఎందుకు తీసెయ్యకూడదు అని సుప్రీం కోర్టు సంజాయిషీ అడగటం అతి పెద్ద ఆశ్చర్యం. ఈ వారం కూడా సీబీఐ ఏమీ చెయ్యకపోతే, వివేకానంద రెడ్డి హత్య కేసు అటకెక్కడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. అవినాష్ , జగన్ ఆశించినట్లు రామ్ సింగ్ ని కేసు నుంచి తొలగిస్తే, ఈ విచారణకు ఇక శుభం కార్డు వేసేయొచ్చు.

సునీత ఇప్పుడు ఏం చెయ్యాలి?

ఈ వారం చాలా కీలకం. ఇంకొక మూడు నాలుగు రోజుల్లో సీబీఐలో కదలిక లేకపోతే, సునీత ఢిల్లీని ఢీ కొట్టాల్సిందే. ఢిల్లీ (Delhi) మీద పోరాడి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ పోరాడటం ధర్మం. సుప్రీం కోర్టులో కేసు వెయ్యాలి. ఖరీదైన లాయర్లు కావాలి. ప్రెస్ మీట్ పెట్టి గొడవ చెయ్యాలి. ప్రతిపక్ష పార్టీలను కలవాలి. తనకు మద్దతుగా నిలబడమని కోరాలి. ఎంత యాగీ చెయ్యాలో అంత యాగీ చెయ్యాలి. ఆలస్యం చేసిన కొద్దీ కేసు వేగం తగ్గుతూ పోతుంది. ఇది తప్ప ఇంకొక మార్గం కనిపించడం లేదు. అవినాష్ , కవిత అరెస్టుల విషయంలో బీజేపీ అడ్డుపడుతుందని సగటు తెలుగు వాడికి ఉన్న అనుమానం. పై గా జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత ఆ రెండు కేసులు ఎలా ఉన్నాయో చర్చ సామాన్యుల్లోనూ జరుగుతుంది. బీజేపీ తెలుగు రాష్ట్రాల లీడర్లు మాత్రం కవిత, అవినాష్ అరెస్ట్ ఖాయం అంటూనే చట్టం తనపని తాను చేసుకొని పోతుందని పాత డైలాగ్ చెబుతున్నారు. కవిత కేసు కూడా సుప్రీం కు సోమవారం విచారణ చేస్తారు. ఆమె వేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా కవితను అనుమానితురాలుగా ఈడీ చెపితే ఇక ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి శాశ్వతంగా కవిత బయట పడినట్టే. అలాగే రాంసింగ్ బదిలీ అయితే అవినాష్ అరెస్ట్ ఇక ఇప్పట్లో చూడలేం. అంటే, జగన్మోహన్ రెడ్డి ఇటీవల అకస్మాత్తుగా అసెంబ్లీ సమావేశాలను కూడా వదిలేసి ఢిల్లీ ఎందుకు వెళ్ళారో ఇక మీరే ఆలోచించుకోండి.

Also Read:  Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?

Exit mobile version