Congress : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. దీనికి కారణం.. అధికార కాంగ్రెస్ పార్టీలో మొదలైన సంస్థాగత ఎన్నికల సందడి. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో పార్టీ పదవులను దక్కించుకొనేందుకు నేతలు పోటీపడుతున్నారు. రాష్ట్రంలోని జిల్లాల స్థాయిలో ఈ ప్రక్రియ జరుగుతోంది. మండల, పట్టణ, బ్లాక్ స్థాయిలో పార్టీ అధ్యక్ష పదవుల భర్తీకి ప్రస్తుతం ముమ్మర కసరత్తు జరుగుతోంది.
Also Read :MLAs Progress Report: సీఎం రేవంత్ చేతిలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. వాట్స్ నెక్ట్స్ ?
35 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు
అత్యధిక పోటీ మాత్రం డీసీసీ అధ్యక్ష పదవికి ఉంది. డీసీసీ అంటే జిల్లా కాంగ్రెస్ కమిటీ. కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులుగా తమకు అనుకూలమైన నేతలే ఉండాలనే పట్టుదలతో రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడి పోస్టుల భర్తీ విషయంలో వారి మధ్య అంతర్గతంగా టఫ్ ఫైట్ జరుగుతోంది. రాష్ట్రంలోని 35 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించారు. ఈక్రమంలోనే ఇటీవలే 35 జిల్లాలకు పీసీసీ పరిశీలకులను నియమించారు. మే 20లోగా డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ డెడ్‌లైన్ విధించారు.
Also Read :India Vs Pakistan : ‘అబ్దాలి’ని పరీక్షించిన పాక్.. సముద్ర జలాల్లో భారత్ ‘త్రిశూల శక్తి’
ప్రతి జిల్లా నుంచి ముగ్గురు నాయకులు
డీసీసీ(Congress) అధ్యక్ష పదవి కోసం ప్రతి జిల్లా నుంచి ముగ్గురు నాయకుల పేర్లను ఎంపిక చేయనున్నారు. వారిపై స్థానిక నాయకుల నుంచి అభిప్రాయసేకరణ జరుపుతారు. ఈ అభిప్రాయ సేకరణలో ఎవరికి మెజారిటీ నేతల మద్దతు లభిస్తే వారినే డీసీసీ అధ్యక్షులుగా ప్రకటిస్తారు. ఇదేవిధంగా మండల, బ్లాక్, గ్రామ కమిటీలు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఇతర అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించనున్నారు. మండల అధ్యక్షుడి పదవికి ఐదుగురి పేర్లను, బ్లాక్ కాంగ్రెస్ పదవులకు నలుగురు పేర్లను ప్రతిపాదిస్తారు. వీరందరి పేర్లను రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల వద్దకు పంపుతారు.అక్కడి నుంచే తుది జాబితా విడుదల అవుతుంది.