కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భస్మాసురుడిలా తయారయ్యాడని, త్వరలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేసారు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ (Dasoju Sravan). బుధువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఫినిష్ చేసిందే రేవంత్ రెడ్డి అని , టీడీపీలో చాలామంది సీనియర్ నాయకులను ఫినిష్ చేసిన ఘనత రేవంత్ రెడ్డిది అని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీని ఫినిష్ చేశాడని దాసోజు శ్రావణ్ ఎద్దేవా చేశారు.
ఇప్పుడు కేసీఆర్‌ను ఫినిష్ చేస్తానని అంటున్నాడని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రే వాళ్లను ఫినిష్ చేస్తా.. వీళ్లను ఫినిష్ చేస్తానని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేక వాదులు కూడా కేసీఆర్‌ను ఫినిష్ చేస్తానని అనలేదని , కానీ సీఎం రేవంత్ మాత్రం రౌడీ లా మాట్లాడుతున్నారని , రేవంత్ కు ఇంకా ఫ్యాక్షన్ బుద్ధులు పోలేదని దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి కాదు.. పెయింటర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నువ్వు ఆంధ్రా నాయకుల బూట్లు మోస్తున్నప్పుడే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడని ,అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి , నువ్వు కూర్చుంటున్న సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్.. నువ్వు తిరుగుతున్న రోడ్లు.. తాగుతున్న నీళ్లు కేసీఆర్ శ్రమ , దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ అయ్యిందంటే అది కేసీఆర్ కృషి అని తెలిపారు. మూసీ పక్కన రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానని అంటున్నావ్.. మరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను ఎందుకు తిడుతున్నావని మండిపడ్డారు. అసలు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అంటూ తీవ్రస్థాయిలో సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Security for Sharmila : షర్మిలకు భద్రతను పెంచాలని డీజీపీని కోరిన కాంగ్రెస్