Site icon HashtagU Telugu

Danam Nagender : దానం కూడా కాంగ్రెస్ గూటికేనా..?

Danam Cm Revanth

Danam Cm Revanth

ఇటీవల బిఆర్ఎస్ (BRS) నేతలు..పార్టీ అధిష్టానానికి వరుస షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో పనిచేసి..పార్టీ లో కీలక బాధ్యతలు చేపట్టిన నేతలు..ఇప్పుడు జై కాంగ్రెస్ (Jai Congress)..జై రేవంత్ (Jai Revanth) అన్న అంటూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా వలసలు అనేవి ఆగడం లేదు. ప్రతి రోజు ఎవరొకరు రేవంత్ ను కలవడం..కాంగ్రెస్ లో చేరిపోవడం చేస్తున్నారు. నిన్నటికి నిన్న మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy)..బెంగుళూర్ లో DK శివకుమార్ ను కలవడం చర్చగా మారింది. ఈరోజు ప్రియాంక గాంధీని కలవబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈరోజు కానీ రేపు కానీ మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని గట్టిగా సంకేతాలు అందుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగానే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)..సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ భేటీ లో ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్షీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దీంతో దానం నాగేందర్.. కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే తాను సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినాని దానం నాగేందర్ చెప్పుకొస్తున్నారు. మరి నిజంగా అందుకేనా..లేక కాంగ్రెస్ లో చేరేందుకా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా , రోశయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుండి పోటీచేసి చింతల రామచంద్ర రెడ్డిపై ఓడిపోయాడు. 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి చింతల రామచంద్ర రెడ్డిపై విజయం సాధించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు.

Read Also : IT Raids : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు