Danam Nagender : కాంగ్రెస్‌లోకి దానం నాగేందర్‌.. క్లారిటీ

  • Written By:
  • Publish Date - March 17, 2024 / 11:58 AM IST

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) (BRS) నుంచి ఫిరాయింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ (Danam Nagender) తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌ ఏ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti Vikramarka), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy), ఏఐసీసీ నేత దీపా దాస్ మున్షీ (Deepa Dasmunsi)తో సమావేశమయ్యారు. అయితే.. దీనికి సంబంధించిన ఫోటోను బీఆర్‌ఎస్‌ నాయకుడు క్రిశాంక్ X లో పోస్ట్‌ చేస్తూ.. ఈ సమావేశం నియోజకవర్గ నిధుల కోసమా.. లేక పార్టీ ఫిరాయించడం కోసమా అన్నట్లు అభివర్ణిస్తూ ట్విట్ చేశారు. దీంతో.. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ క్రమంలో దానం నాగేందర్‌ బీఆర్‌ఎస్‌ వీడతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఒక వేళ గులాబీ గూటిని దానం నాగేందర్‌ వీడితే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నలు కూడా నెట్టింట చర్చలు జరిపారు నెటిజన్లు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై దానం నాగేందర్‌ స్పందిస్తూ.. తాను కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు . ఈ వార్తలను నిరాధారమైన వదంతులుగా కొట్టిపారేసిన ఆయన, తాను కాంగ్రెస్‌లో చేరేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎంపీ స్థానానికి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం సమస్యలు, అభివృద్ధిపైనే తాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యానని నాగేందర్ వివరించారు. పార్టీని వీడే ఉద్దేశాలను నిరాకరిస్తూ, BRS పట్ల తన నిబద్ధతను ఆయన ధృవీకరించారు. విస్తృతమైన ఊహాగానాలు ఉన్నప్పటికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డితో ఆయన భేటీ తర్వాత, మరుసటి రోజు (18వ తేదీ) శుభ ముహూర్తంతో కాంగ్రెస్‌లో చేరతారని సూచించడంతో, నాగేందర్ ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవని సూచిస్తూ కొట్టిపారేశారు.
Read Also : KTR and Harish Rao : ఢిల్లీకి కేటీఆర్‌, హరీష్ రావు