Site icon HashtagU Telugu

KTR: ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చేలా దళితబంధు : మంత్రి కేటీఆర్

Ktr

Ktr

KTR: దళితబంధు పథకంలో భాగంగా 162 మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించింది. ఇందులో భాగంగా మరిన్ని కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని సంకల్పించింది.

దీనికోసం హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి ఆధ్వర్యంలో నడిచే మురుగు వ్యర్థాల రవాణా (సిల్ట్ కార్టింగ్) వాహనాలను ఈ పథకం కింద అందచేశారు. పలువురు దళిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఈ పథకం ముఖ్యోద్దేశం.  దళితుల ఉద్ధరణ కోసమే.. తమ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తామన్నారు. ఇది కేవలం దమ్మున్న నాయకులతోనే సాధ్యమవుతుందని అన్నారు. దళితబంధు అందాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నారని కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదని అన్నారు. రానున్న రోజుల్లో అర్హులైన అందరికీ దళితబంధు సాయం అందిస్తామని చెప్పారు. మహాత్మ గాంధీ ఆలోచనలతో స్వచ్ఛ హైదరాబాద్‌, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టామన్నారు. గాంధీ జయంత్రి సందర్భంగా 162 సిల్ట్‌ కార్టింగ్‌ వెహికల్స్‌ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Also Read: Bigg Boss: బిగ్ బాస్ షో కోసం రతిక రోజ్ ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా!

Exit mobile version