తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Telangana State Government Employees) శుభవార్త. జూన్ 2న రాష్ట్ర అవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) సందర్భంగా పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) చెల్లించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం, పెండింగ్‌లో ఉన్న డీఏలలో ఒకదాన్ని ఈ సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది వేలాది మంది ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఆర్థిక ఊరట కలిగించనుంది.
Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ
ఇది మాత్రమే కాకుండా, ఇతర పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లను కూడా త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కొత్త ఆరోగ్య పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు అధికారుల కమిటీతో జరిగిన చర్చల అనంతరం తీసుకున్నవిగా చెబుతున్నారు. కొన్ని కీలక డిమాండ్లను అధికారులు అంగీకరించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమైన తర్వాత ముఖ్య కార్యదర్శి (CS) అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. అవిర్భావ దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందడుగు వేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.