Site icon HashtagU Telugu

CWC Meeting : హైద‌రాబాద్ లో CWC,అగ్ర‌నేత‌ల రాక‌, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అప్పుడే!

Cwc Meeting

Cwc Meeting

CWC Meeting : తెలంగాణ‌లో రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు ఢిల్లీ నుంచి హైద‌రాబాదుకు రాబోతున్నారు. మూడు రోజుల పాటు హైద‌రాబాద్ లోనే మకాం వేసేలా ప్లాన్ చేశారు. ఇటీవ‌ల సీడ‌బ్ల్యూసీని ప్ర‌క్షాళ‌న చేసిన త‌రువాత జ‌రుగుతోన్న తొలి స‌మావేశాన్ని హైద‌రాబాద్ లోనే ఫిక్స్ చేశారు. సెప్టెంబ‌ర్ 16న సీడ‌బ్ల్యూసీ స‌మావేశం, 17న హైద‌రాబాద్ లో భారీ ర్యాలీ, 18న నియోజ‌క‌వ‌ర్గాల్లో ర్యాలీలు, కేసీఆర్ ప్ర‌భుత్వం మీద చార్జిషీట్ ల‌ను విడుద‌ల చేసేలా ప్ర‌ణాళిక‌ను ర‌చించింది. ఆ మూడు రోజులు ఇచ్చే జోష్ తో ఎన్నిక‌ల‌కు మ‌రింత దూకుడుగా వెళ్లాల‌ని ఆ పార్టీ అగ్ర‌నేతలు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు హైద‌రాబాద్ రానున్నారు. సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17వ తేదీ హైదరాబాద్‌ సంస్థానం భారత్ లో విలీనమైన రోజు. ఆ వేడుకల‌కు సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

18వ తేదీన బీఆర్ఎస్ సర్కార్ పై చార్జిషీట్ (CWC Meeting)

16వ తేదీన సిడబ్ల్యూసీ ప్రతినిధుల సమావేశం (CWC Meeting) జరుగుతుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సోమ‌వారం ప్ర‌క‌టించారు. 17వ తేదీన సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేతలు సమావేశం అవుతారు. అదే రోజు మెగా ర్యాలీ ఉంటుంద‌ని వివ‌రించారు. ఈ ర్యాలీలో ఐదు డిక్లరేషన్లను ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు వేణుగోపాల్ వెల్ల‌డించాఉ. 18వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీటు విడుదల చేయ‌డంతో పాటు ఆ రోజున‌ అభ్యర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌డానికి క‌స‌రత్తు చేస్తున్న‌ట్టు సంకేతాలు ఇచ్చారు.

బస్సు యాత్రకు టీ కాంగ్రెస్

మొత్తం 100 మందికి పైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలు తెలంగాణవ్యాప్తంగా పర్యటించేలా రూట్ మ్యాప్ ఖ‌రారు అయింది. అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్ట‌నుంది. నెల రోజుల పాటు జరిగే ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర కీలక నేతలు ఉంటారు.

సీడబ్ల్యూసీ భేటీ తర్వాత అభ్యర్థుల ప్రకటన (CWC Meeting)

సీడబ్ల్యూసీ భేటీ (CWC Meeting) తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. లిస్ట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత .. హైకమాండ్ ఆమోదంతో తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సోనియాతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ట‌చ్ లో ఉన్నారేమో..!

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే వాళ్ల‌లో ష‌ర్మిల పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయ‌డం ద్వారా పార్టీలో కీల‌కం కాబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, కేసీ వేణుగోపాల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. అలాగే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల త‌రువాత ఎంపీల మ‌ద్ధ‌తు హామీ ఇచ్చారా? అనే ప్ర‌శ్న‌కు వేణుగోపాల్ నుంచి ఎలాంటి స‌మాధానం లేదు. సోనియాతో ట‌చ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారా? లేదా? అనేది త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు

Also Read: Congress Groups : తెలంగాణ కాంగ్రెస్ లో `ఉద‌య్ పూర్` క‌ల్లోలం!