Site icon HashtagU Telugu

Lucky Bhaskar : క్రిప్టో ఫ్రాడ్.. ‘లక్కీ భాస్కర్‌’లా రూ.కోట్లు దేశం దాటించిన రమేశ్‌గౌడ్‌

Crypto Fraud Telangana Ramesh Goud Lucky Bhaskar

Lucky Bhaskar : ‘లక్కీ భాస్కర్’ సినిమా స్టోరీ చాలామందిని ఆకట్టుకుంది. బాగానే టైంపాస్ చేయగలిగింది. అయితే అందులో చూపిన కొన్ని అంశాలు సమాజాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే ముప్పు ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా.. అడ్డదారి అనేది అస్సలు సరికాదు. జనగామ జిల్లా లింగాల ఘన్‌‌పూర్‌ గ్రామానికి చెందిన రమేశ్ గౌడ్ తెలంగాణ భారీ క్రిప్టో కరెన్సీ స్కాం చేశాడు. అతగాడి వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెదక్, వరంగల్‌ జిల్లాల్లో ఎంతోమంది మోసపోయారు. భారీ లాభాల కోసం ఆశపడి దగాపడ్డారు.  జీబీఆర్ పేరిట అతడు నకిలీ క్రిప్టో కరెన్సీ వెబ్‌సైట్ నడిపి అందరినీ చీట్ చేశాడు. ఈవిధంగా రమేశ్ గౌడ్ దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని అంటున్నారు. అయితే ఈ సొమ్మును అతడు తెలివిగా, లక్కీ భాస్కర్(Lucky Bhaskar)స్టైల్‌లో మన దేశం దాటించాడు. ఆ వివరాలను తెలుసుకుందాం..

Also Read :Upcoming Movies List : వాలెంటైన్స్‌ డే వేళ థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలివే

దుబాయ్‌కు ఇలా పంపాడు.. 

క్రిప్టో కరెన్సీ స్కాం ద్వారా సంపాదించిన రూ.100 కోట్లలో దాదాపు రూ.40 కోట్లను జీబీఆర్ రమేశ్ గౌడ్ దుబాయ్‌కు పంపాడట. ఇంతకీ అదెలా సాధ్యమైంది ? అంటే.. హవాలా మార్గం ద్వారా ! తన దగ్గరున్న రూ.40 కోట్లను తీసుకొని రమేశ్ గౌడ్ జగిత్యాల, వరంగల్‌ జిల్లాలలో ఉన్న హవాలా వ్యాపారులను కలిశాడు. వాళ్ల సాయంతో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి దుబాయ్‌కు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.

హవాలా సీక్రెట్స్ తెలుసుకొని.. 

మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న సంబంధీకులకు అన్ లిమిటెడ్‌గా డబ్బును పంపడానికి హవాలా మార్గాన్ని వాడుతుంటారు. ఇందుకోసం హవాలా వ్యాపారులు ఉంటారు. ఎగ్జాంపుల్‌గా పరిశీలిస్తే.. కోటి రూపాయలను దుబాయ్‌కు పంపాలని భావిస్తే, దీనిలో హవాలా వ్యాపారి తన కమీషన్‌ను తీసుకొని, మిగిలిన డబ్బంతా విదేశాల్లో ఉన్న వ్యక్తికి అందే ఏర్పాట్లు చేస్తాడు. ఈక్రమంలో హవాలా వ్యాపారి రూ.10 నోటును చింపి ఇస్తాడు. విదేశాలకు వెళ్లి  ఆ చినిగిన ముక్కను చూపిస్తే, మిగతా డబ్బు అందిస్తారు. ఇదే తరహాలో రమేశ్‌గౌడ్‌ తన డబ్బును హవాలా రూటులో దుబాయ్‌కు చేరవేశాడు. అక్కడే డ్రా చేసుకున్నాడు. వాటిని డాలర్ల రూపంలోకి మార్చుకున్నాడు. వాటితో అక్కడే ఆస్తులు కొన్నాడు. దుబాయ్‌లోనే పదేళ్లు నివసించేలా వీసా సంపాదించడాన్ని సీఐడీ అధికారులు గుర్తించారు. ఇలా దేశం దాటిపోయిన బాధితుల డబ్బును తిరిగి తీసుకురావడం తెలంగాణ సీఐడీకి  ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.

Also Read :Weekly Horoscope: వాళ్లకు అప్పులు తీరుతాయ్.. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రాశిఫలాలు