తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham)కు న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారంరోజుల క్రితం కొందరు దుండగులు ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Rohit Sharma: శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా రోహిత్ శర్మ!
పోలీసుల విచారణలో ఈ నేరానికి పాల్పడిన వారు మధ్యప్రదేశ్‌కు చెందినవారని గుర్తించారు. ఆధునిక సాంకేతిక సహాయంతో నేరస్తులను ట్రాక్ చేసిన అధికారులు, అక్కడే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసగాళ్లు ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ నకిలీ వీడియో కాల్స్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Kidney Problems: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కిడ్నీ కేసులు.. నిమ్స్ సంచలన నివేదిక
అదుపులోకి తీసుకున్న నిందితులను నకిరేకల్‌కు తీసుకురాగా, వారి విచారణ కొనసాగుతోంది. ఈ తరహా సైబర్ నేరాల పెరుగుదలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు అపరిచిత కాల్స్‌ను సమర్ధంగా హ్యాండిల్ చేయాలని, సైబర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కేసు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.