CV Anand : బీజేపీ నేతకు రిలాక్స్‌గా ఉండండి అంటూ సీపీ ఆనంద్ కౌంటర్

CV Anand : ఇలాంటి నోటిఫికేషన్ లు దేశంలో సాధారణం..ఇది కర్ఫ్యూ అంటూ కొంతమంది తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. మీరు రిలాక్స్‌గా ఉండండి

Published By: HashtagU Telugu Desk
Cv Anand

Cv Anand

హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ను (144 section in Hyderabad) అమలు చేయడంపై బీజేపీ ఐటీ & సోషల్‌ మీడియా కో-కన్వీనర్ అజయ్ నాయర్ (BJP IT & Social Media Co-Convenor Ajay Nair) చేసిన విమర్శలకు సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) కౌంటర్ ఇచ్చారు.ఈ నెల 27 న హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారికంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సోషల్ మీడియా లో ఒక నోటీసును విడుదల చేశారు. ఈ నోట్ ప్రకారం.. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడా కూడదని, ధర్నాలు, ర్యాలీలు మరియు పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడదని పేర్కొన్నారు.

దీనిపై అజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వ భయపడుతున్నదా లేదా హైదరాబాద్ మార్చిపోతుందా అంటూ సెటైర్ వేయగా, సీపీ సీవీ ఆనంద్ ఈ నిర్ణయం పట్ల వివరణ ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగా, ఈ నోటిఫికేషన్‌ దీపావళి పండుగకు సంబంధం లేదని, కొన్ని గ్రూపులు ప్రభుత్వ ఆస్తులపై ఆకస్మిక దాడులు చేసే ప్లాన్ చేశారని, ఆ విషయంపై వారికి ఇంటెలిజెన్స్ సమాచారం అందినందున చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇలాంటి నోటిఫికేషన్ లు దేశంలో సాధారణం..ఇది కర్ఫ్యూ అంటూ కొంతమంది తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. మీరు రిలాక్స్‌గా ఉండండి” అని కౌంటర్ ఇచ్చాడు.

Read Also : Operation ASAN : మేడ్ ఇన్ మెదక్.. ‘బీఎంపీ-2 శరత్‌’‌తో ఉగ్రవాదుల ఏరివేత సక్సెస్

  Last Updated: 29 Oct 2024, 02:30 PM IST