Site icon HashtagU Telugu

Nalgonda Politics: కోవర్ట్ కోమటిరెడ్డి.. నల్లగొండలో పోస్టర్ల కలకలం

Nalgonda

Nalgonda

మునుగోడు (Munugode) ఉప ఎన్నికతో మొదలైన పోస్టర్ల (Posters) కలకలం నేటిదాకా వెలుగుచూస్తున్నాయి. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ పోటీపడి ఒక పార్టీపై మరో పార్టీ పోస్టర్లు వేశాయి. ఈ నేపథ్యంలో నల్లగొండ (Nalgonda) జిల్లాలో మరోసారి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కి వ్యతిరేకంగా వెలసిన వాల్ పోస్టర్లు చర్చనీయాంశమవుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ హైవే పక్కన చందంపల్లి దగ్గర కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) కి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి.

కోవర్ట్ కోమటిరెడ్డి అంటూ హెడ్డింగ్ పెట్టారు. నిఖార్సైన కార్యకర్తల ఆవేదన అంటూ మరో హెడ్డింగ్ వేశారు. 13 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ పోస్టర్ లలో ప్రస్తావించారు. సొంత గ్రామంలో సర్పంచ్, ఎంపిటిసి లను గెలిపించుకొలేని అసమర్థుడు కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) అనీ.. కనీసం నార్కట్ పల్లి మండలంలో సోదరుడిని జడ్పీటిసి గా గెలిపించుకునే సత్తా లేని కోమటిరెడ్డి అంటూ రాశారు. జిల్లాలో ఎన్ని సభ్యత్వాలు నమోదు చేశారో కోమటిరెడ్డి సమాధానం చెప్పాలని కూడా ప్రశ్నించారు. ఇలా మొత్తం 13 ప్రశ్నలను సందిస్తూ సవాల్ చేశారు. కాగా కాంగ్రెస్ (Congress) పార్టీలో వైరి వర్గమే ఈ పోస్టర్ లు అంటించారని కోమటిరెడ్డి వర్గీయులు భావిస్తున్నారు.

Also Read: Dasara Teaser: నాని దసరా టీజర్ ను చూశారా!