Clock Tower : హైదరాబాద్‌లో మరో క్లాక్ టవర్ రానుంది. ఈ మేరకు చాదర్‌ఘాట్ పరిధిలోని అజంపురాలో కొత్తగా క్లాక్ టవర్‌ను నిర్మాణపనులు చేపట్టారు. దాదాపు నిర్మాణ పనులు పూర్తై ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఏఈ మల్లికార్జున్ తెలిపారు. 30 ఫీట్ల ఎత్తులో నాలుగు వైపులా గడియారం ఉంటుంది. చుట్టుపక్కల లైట్లు.. టవర్ చుట్టూ అహ్లాదకర వాతావరణం ఉండేందుకు గడ్డితోపాటు మొక్కలు నాటారు. నాలుగు వైపులా మార్గం ఒకవైపు చాదర్‌ఘాట్, డబిర్ పురా, యాకత్‌పురా, అజంపురా వైపు వెళ్తుంది. క్లాక్ టవర్ ఏర్పాటుకు రూ. 75 లక్షలు కేటాయించారని ఏఈ మల్లికార్జున్ తెలిపారు.
మరోవైపు అజంపురాలో కొత్తగా నిర్మిస్తున్న క్లాక్ టవర్ నిర్మాణ పనులను మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల సోమవారం పరిశీలించారు. సుమారు రూ.55లక్షల నిధులను ఇదివరకే మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే క్లాక్ టవర్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయన్నారు. ఇదివరకు ఇక్కడున్న ఆజంపుర చమన్ బిచ్చగాళ్లకు, వైట్‌నర్లు వాడే యువకులకు, తోపు డుబండు, పుట్‌పాత్ వ్యాపారులకు అడ్డాగా మారిందన్నారు. ఆజంపుర చమన్‌ను పూర్తిగా కుదించేసి అందులో క్లాక్ టవర్ నిర్మించాలని నిర్ణయించి ప్రతిపాదనలు తయారు చేయించడంతోపాటు నిధులను కూడా మంజూరు చేయించినట్లు ఆయన వివరించారు. క్లాక్ టవర్ నిర్మాణంతోపాటు మరో రూ.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మా ణ పనులు కూడా దాదాపుగా పూర్తి చేయించినట్లు తెలిపారు. క్లాక్ టవర్, సీసీ రోడ్ల నిర్మాణానికి గాను రూ.కోటి 5లక్షల నిధులు వెచ్చించినట్లు ఎమ్మెల్యే వివరించారు.
Read Also: Ashu Reddy : కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఆషురెడ్డి ..