మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బీజేపీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy)ని హత్య (Murder)చేయాలని పెద్ద మొత్తంలో సుపారీ ఇచ్చినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు సంబంధించి కర్నూల్ మరియు కర్ణాటక ప్రాంతాల రౌడీషీటర్లు కలిసి పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రకు సంబంధించిన ఓ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దాదాపు రెండున్నర కోట్ల రూపాయల డీల్ జరిగినట్లు బయటపడింది.
Mega DSC : ఏపీలో మెగా DSC నోటిఫికేషన్ విడుదల
ప్రశాంత్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటం, ఇప్పుడు అతనిపై మరోసారి ప్రాణహాని కుట్ర జరుగుతుండటం స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. ఆడియోలో మాట్లాడిన మాటలు, ప్రణాళిక వివరాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే ప్రశాంత్ రెడ్డి మహబూబ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోను విశ్లేషించడంతో పాటు, సంబంధిత వ్యక్తుల కాల్ రికార్డులు, కదలికలు సేకరిస్తున్నారు. సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ కక్షల ఫలితమా? లేక వ్యక్తిగతంగా ఏదైనా కారణమా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.