MLC Kavitha: సాయిచంద్ భార్యకు ప‌రామ‌ర్శ‌.. కవిత కంటతడి

సాయి చంద్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

Published By: HashtagU Telugu Desk
Sai Chand

Sai Chand

ఇటీవల మరణించిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయి చంద్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన కవిత.. సాయిచంద్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కవితను చూసిన సాయిచంద్ సతీమణి భోరున విలపించారు. ఆమెను ఓదారుస్తూ కవిత కన్నీళ్లు పెట్టుకోవటం అక్కడున్న వారికి కూడా కళ్లల్లో నీళ్లు తిరిగేలా చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఎంతోమందిని చైతన్యవంతం చేశారని పేర్కొంది. మా అందరికీ ఆత్మీయుడు చనిపోయాడని వార్త జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. సాయిచంద్ మరణం తీరని లోటు అని తెలిపారు . ఆయన కుటుంబానికి అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు.

సాయిచంద్ కన్నుమూసి ఇంకా వారం కూడా కాలేదు. ఆయన లేరనే బాధను కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ టైమ్​లో సాయిచంద్ సతీమణి రజని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.  దీంతో ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే రజనీని గుర్రంగూడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. సాయిచంద్ భార్య రజనీకి డాక్టర్లు ట్రీట్​మెంట్ ఇవ్వడంతో ఆరోగ్యంగా ఉంది.

Also Read: Madhapur Accident: మాదాపూర్‌లో విషాదం… వాటర్ ట్యాంకర్‌ ఢీకొని స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి

  Last Updated: 06 Jul 2023, 05:22 PM IST