Revanth Reddy: కేసీఆర్‌కు పదేళ్లు అవకాశం ఇచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని, పైగా బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. BRS పార్టీకి మరో అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేం.
తెలంగాణ తెచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ నిర్ణయంతో తమ పార్టీ ఎఫెక్ట్ అవుతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా అని రేవంత్ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌కు మరో అవకాశం ఇవ్వడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు హామీలను అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.
ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కుట్రలు చెల్లవని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని మళ్లీ తీసుకువస్తామన్నారు. కంప్యూటర్ తెచ్చింది.. ఐటీ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. హైదరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్, మెట్రో, గోదావరి, కృష్ణ నీళ్లు తెచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని తెలిపారు. పాలమూరు జిల్లాలో మొత్తం సీట్లు గెలవబోతున్నాం.. వంద సీట్లతో కాంగ్రెస్ గెలవబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Kishan Reddy: బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ : కిషన్ రెడ్డి