Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమ‌టిరెడ్డిపై తేల్చుడే.!

కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమ‌వారం స‌మావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఆధ్వ‌ర్యంలో ఎంప‌వ‌ర్డ్ యాక్ష‌న్ గ్రూప్ స‌మావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌ను స‌మీక్షించ‌నున్నారు. ప్ర‌ధానంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని తేల్చ‌నుంది. అదే విధంగా క‌ర్నాట‌క రాష్ట్ర ప‌రిస్థితుల‌ను సీరియ‌స్ గా తీసుకోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన భార‌త్ జోడో యాత్రను స‌మీక్షించ‌డంతో పాటు రాజ‌కీయ స‌వాళ్ల మీద రూట్ మ్యాప్ త‌యారు చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - November 12, 2022 / 02:32 PM IST

కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమ‌వారం స‌మావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఆధ్వ‌ర్యంలో ఎంప‌వ‌ర్డ్ యాక్ష‌న్ గ్రూప్ స‌మావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణ‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌ను స‌మీక్షించ‌నున్నారు. ప్ర‌ధానంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని తేల్చ‌నుంది. అదే విధంగా క‌ర్నాట‌క రాష్ట్ర ప‌రిస్థితుల‌ను సీరియ‌స్ గా తీసుకోనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన భార‌త్ జోడో యాత్రను స‌మీక్షించ‌డంతో పాటు రాజ‌కీయ స‌వాళ్ల మీద రూట్ మ్యాప్ త‌యారు చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది.

ఏఐసీసీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ 2024 కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. ఆమె అధ్య‌క్షురాలిగా ఉన్న‌ప్పుడే వేసిన `ఎంప‌వ‌ర్డ్ యాక్ష‌న్ గ్రూప్` అది. దాన్నే కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ గా పిలుస్తున్నారు. ఆ గ్రూపులో పి చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలా, ప్రియాంక గాంధీ వాద్రా, సునీల్ కానుగోలు ఉన్నారు. వాళ్లంద‌రూ సోమవారం ఢిల్లీలో స‌మావేశం కానున్నారు. రాజ‌స్థాన్ చింత‌న్ శిబిర్ లో చేసిన తీర్మానాల‌ను స‌మీక్షిస్తార‌ని అధికారిక స‌మాచారం.

Also Read:  Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీల‌క కేంద్రం – ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

ఎన్నికల వ్యూహ బృందంలోని సభ్యులు టాస్క్‌ఫోర్స్ గా ఏర్ప‌డ్డారు. వాళ్లు 2024 ఎన్నికల ప్రణాళిక గురించి కొత్త అధ్యక్షుడికి తెలియజేస్తారు.2024 లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్స్‌, కొత్త పార్టీ అధినేత మల్లికార్జున్‌ ఖర్గే నేతృత్వంలో సోమవారం తొలిసారి సమావేశం కానుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతలు స్వీకరించిన తర్వాత టాస్క్‌ఫోర్స్‌ సమావేశం కావడం ఇదే తొలిసారి.

గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఏప్రిల్‌లో రాజస్థాన్లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పెద్ద సమావేశం అయింది. 2024 జాతీయ ఎన్నికలకు ముందు “రాజకీయ సవాళ్లను” పరిష్కరించడానికి “ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్”ని ప్రకటించింది. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2024 టాస్క్‌ను రూపొందించారు. చింత‌న్ శిబిర్ లో 70 ప్ల‌స్ నాయ‌కుల‌ను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు ప‌క్క‌న పెట్ట‌డం, ఒక ఇంటిలో ఒక‌రికే ప‌దవి, యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డం త‌దిత‌ర కీల‌క అంశాలు ఉన్నాయి. వాటిని అమ‌లు చేయించ‌డానికి టాస్క్ ఫోర్స్ కీల‌క రోడ్ మ్యాప్ ను రూపొందిస్తుంద‌ని తెలుస్తోంది.

Also Read:  Parliament: నవంబర్ లో కాదు…డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు..ఎందుకంటే.!!