Site icon HashtagU Telugu

Modi Warangal Meeting: మోడీ బీఆర్ఎస్ అవినీతి వ్యాఖ్యలపై జైరాం రమేష్ ఎటాక్

Modi

New Web Story Copy 2023 07 08t184152.315

Modi Warangal Meeting: ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనలో భాగంగా అధికార పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అవినీతి ఢిల్లీ వరకు పాకిందంటూ విమర్శలు గుప్పించారు. కవిత లిక్కర్ స్కామ్ పాత్రపై మోడీ మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్టు మోడీ నోట రావడం ఆసక్తికరంగా మారింది.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ రూ. 520 కోట్లతో వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, రూ. 20,000 కోట్ల రూపాయల ఇంజిన్‌ను తీసుకెళ్ళి రాష్ట్ర ప్రజలను ప్రధాని అవమానించారని విమర్శించారు. తెలంగాణలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ 16 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేయకపోగా, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలను శాశ్వతంగా ప్రైవేటీకరించడంపై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టు విమర్శించారు జైరాం రమేష్. బీజేపీ బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకంగా పోరాడుతుందని తెలంగాణ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నప్పటికీ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి ఉన్నాయని ఆరోపించారు జైరాం రమేష్.

భారతదేశంలోని అత్యంత అవినీతి ప్రభుత్వంగా మేఘాలయ ప్రభుత్వాన్ని హెచ్‌ఎం పేర్కొన్నదని చెప్పారు. ఇప్పుడు సంగ్మాతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. హెచ్‌ఎం చేసిన తీవ్రమైన ఆరోపణలపై నేను మార్చి 21, 2023న సీబీఐకి లేఖ రాశాను. దానిపై ఇంకా స్పందన లేదు. ఎన్‌సీపీని సహజంగా అవినీతి పార్టీగా ప్రధాని అభివర్ణించిన సందర్భం కూడా ఉంది అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

Read More: MS Dhoni: పెంపుడు కుక్కల సమక్షంలో కేక్ కట్ చేసిన మాహీ