Site icon HashtagU Telugu

Congress Rebels Withdraw Nominations : కాంగ్రెస్ కు పెద్ద గండం తప్పింది..

Congress Rebels Withdraw Nominations

Congress Rebels Withdraw Nominations

టి కాంగ్రెస్ (Congress) కు పెద్ద గండం తప్పింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల (Congress Candidate List) లిస్ట్ లో కొంతమంది పేర్లు రాకపోవడం తో వారంతా రెబెల్స్ (Congress Rebels) గా నామినేషన్ వేశారు. నిన్నటి వరకు వారంతా ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడం తో కాంగ్రెస్ అధిష్టానం కాస్త ఖంగారుపడ్డారు. ఈ క్రమంలో ఠాక్రే ను రంగంలోకి దింపు రెబెల్స్ తో బుజ్జగింపులు చేసారు. ఈ బుజ్జగింపులతో రెబెల్స్ శాంతించారు.

We’re now on WhatsApp. Click to Join.

రెబల్ లీడర్లు నామినేషన్లు విత్ డ్రా (Congress Rebels Withdraw Nomination) చేసుకోకపోతే పార్టీ ఓట్లు చీలి బీఆర్ఎస్‌కు లాభం చేకూరే అవకాశం ఉందని..కాంగ్రెస్ అదిష్ఠానం చెప్పడం తో వారంతా నామినేషన్ ను విత్ డ్రా (Withdraw ) చేసుకున్నారు. విత్ డ్రా చేసుకున్న వారందరికీ అధికారంలోకి రాగానే డీసీసీ అధ్యక్ష పదవులు, మరికొందరికి ఎంపీ టికెట్ల ఇస్తామని కాంగ్రెస్ తరపున హామీ లభించింది. అలాగే మరికొంతమందికి ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల హామీ లభించడంతో రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక నామినేషన్ విత్ డ్రా చేసిన రెబల్ నేతలలో సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, బాన్సువాడ నుంచి కాసుల బాలరాజు, డోర్నకల్‌ నుంచి నెహ్రూ నాయక్, వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి దండెం రాంరెడ్డి, జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారం ఉన్నారు.

Read Also : Chandrababu Health Condition : చంద్రబాబుకు గుండెపోటు వచ్చే ప్రమాదం..!