Jaggareddy : ముంగిసలా బీఆర్ఎస్‌ను మింగేస్తా అని చెప్పిన జగ్గారెడ్డి ..!

Jaggareddy : రాజకీయ ప్రసంగాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టైలే వేరు.

  • Written By:
  • Updated On - November 27, 2023 / 08:00 PM IST

Jaggareddy : రాజకీయ ప్రసంగాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టైలే వేరు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీపైకి  జగ్గారెడ్డి పదునైన వాక్బాణాలను సంధించారు. ఆదివారం మధ్యాహ్నం సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని గంజి మైదాన్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా జగ్గారెడ్డి ప్రజలను ఆలోచింపజేసే పదజాలంతో  పాము, ముంగీస కథను చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘గతంలో శ్రీమతి ఇందిరా గాంధీ కూడా మెదక్ ఎంపీగా పోటీ చేశారు. ఇదే సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్‌లో నామినేషన్ వేసి.. ఇదే గంజి మైదాన్ లో పబ్లిక్‌ను అడ్రెస్స్ చేస్తూ ప్రసంగించారు. ఇప్పుడు మళ్లీ ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ గంజి మైదాన్‌కు వచ్చి పబ్లిక్‌ను ఉద్దేశించి ప్రసంగించడం చాలా ఆనందంగా ఉంది. నేను ముంగీస లాంటివాడిని. బీఆర్ఎస్ పాము లాంటిది. ఈ రెండింటిలో ఏది ప్రమాదకరం ? పాము ప్రమాదకరం కదా !!  అలాంటి పాముతో కొట్లాడగలిగేది కేవలం ముంగీసే !! సంగారెడ్డిలో బీఆర్ఎస్‌తో కొట్లాడగలిగేది నేను ఒక్కడినే. పాము.. ముంగిసలో ఎవరు గెలుస్తారో ఓటర్లే చెప్పాలి. కాబట్టి ముంగీసను కాపాడుకోండి. ఇప్పుడు పాము ఇంటింటికి వస్తుంది జాగ్రత్త!! ఐదేళ్లకోసారి జేబులో చెయ్యి పెట్టే బీఆర్ఎస్ కావాలా ? ఎదురుపడ్డప్పుడల్లా జేబులో చేయి పెట్టే నేను కావాలా ? ఓటర్లే తేల్చుకోవాలి’’ అని జగ్గారెడ్డి చెప్పారు.

Also Read: 995 Jobs -IB : డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరో‌లో 995 జాబ్స్

తాజాగా వచ్చిన ప్రీ పోల్ సర్వేలో కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకే అత్యధిక సీట్లు వస్తాయని తేలింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు మరింత జోష్ గా ప్రచారం చేస్తున్నారు. అటు ప్రియాంకాగాంధీ సైతం విజయభేరి సభల్లో(Jaggareddy) పాల్గొంటున్నారు.