Site icon HashtagU Telugu

Congress Party : కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ – రాజాసింగ్

Raja Singh spoke with Media about Contesting in Goshamahal From BJP

Raja Singh spoke with Media about Contesting in Goshamahal From BJP

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLC Rajasingh) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) హోలీ (Holi) సందర్భంగా గుంపులుగా తిరగొద్దని ఆంక్షలు విధించడంపై మండిపడ్డ ఆయన, ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను (Anti-Hindu Policies) అనుసరిస్తోందని ఆరోపించారు. హిందువుల పండుగలకే ఆంక్షలు విధించే విధానం న్యాయసమ్మతమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, హోలీ రోజునా ఇలాంటి ఆంక్షలు అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Vijayasai Reddy Vs Coterie: విజయసాయి చెబుతున్న కోటరీలో ఉన్నదెవరు ? ఎదురైన చేదు అనుభవాలేంటి ?

తన విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ, హిందువుల పండుగలకు మాత్రమే ఆంక్షలు విధించడం ఎందుకని ప్రశ్నించారు. ముస్లింలు రంజాన్‌లో రాత్రివేళల్లో బహిరంగంగా నిర్వహించే కార్యక్రమాల గురించి ఎవరూ ప్రశ్నించరా? అని మండిపడ్డారు. “మా పండుగ ఎలా జరుపుకోవాలో మాకు పోలీసులు లేదా 9వ నిజాం రేవంత్ చెప్పాలా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. హోలీ రోజు హిందువులను గుంపులుగా తిరగొద్దని చెప్పడం కన్నా, ఇతర మతస్తులకు ఇలాంటి ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు.

Lakshmi Devi: పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో లక్ష్మీ ఆగ్రహానికి గురై వెళ్ళిపోతుందట?

ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీజేపీ వర్గాలు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలవగా, కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ప్రభుత్వం ఏ మతానికీ వ్యతిరేకం కాదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు ఆంక్షలు విధించారని చెప్పుకొస్తోంది. అయితే ఈ రాజకీయ ఆరోపణలు హిందూ వర్గాల్లో కొంత అసంతృప్తిని కలిగించవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పాలిటిక్స్‌లో మత రాజకీయాలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.