Lok Sabha Seats : ఆ నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన నేడే.. లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే

Lok Sabha Seats : త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని 17 స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జుల​ను నియమించింది.

  • Written By:
  • Updated On - April 1, 2024 / 08:00 AM IST

Lok Sabha Seats : త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని 17 స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జుల​ను నియమించింది. ఈ మేరకు హస్తం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. లోక్​‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, సీనియర్ నేతలను ఇంఛార్జీలుగా నియమిస్తూ పలు మార్పులు చేసినట్లు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

ఇంఛార్జీలు వీరే

1. ఖమ్మం  ఇంఛార్జి – పొంగులేటి శ్రీనివాసరెడ్డి

2. నల్గొండ ఇంఛార్జి – ఉత్తమ్ కుమార్ రెడ్డి

3. కరీంనగర్  ఇంఛార్జి – పొన్నం ప్రభాకర్

4. పెద్దపల్లి ఇంఛార్జి – శ్రీధర్ బాబు

5. మహబూబాబాద్ ఇంఛార్జి – తుమ్మల నాగేశ్వరరావు

6. వరంగల్ ఇంఛార్జి- ప్రకాష్ రెడ్డి

7. హైదరాబాద్ ఇంఛార్జి- ఒబేదుల్లా కొత్వాల్

8. సికింద్రాబాద్ ఇంఛార్జి- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Also Read : Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. చెన్నైపై 20 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం..!

9. భువనగిరి ఇంఛార్జి- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

10. చేవెళ్ల  ఇంఛార్జి- నరేందర్ రెడ్డి

11. నాగర్ కర్నూల్ ఇంఛార్జి- జూపల్లి కృష్ణారావు

12. మెదక్  ఇంఛార్జి- కొండా సురేఖ

13. నిజామాబాద్ ఇంఛార్జి- సుదర్శన్ రెడ్డి

14. మల్కాజిగిరి  ఇంఛార్జి- మైనంపల్లి హన్మంతరావు

15. ఆదిలాబాద్ ఇంఛార్జి- సీతక్క

16. జహీరాబాద్ ఇంఛార్జి- దామోదర రాజనర్సింహ

17. మహబూబ్ నగర్ ఇంఛార్జి- సంపత్ కుమార్

Also Read :DC vs CSK: క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును సమం చేసిన వార్నర్

నాలుగు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ నేడే

రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాలకుగానూ ఇప్పటికే 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన నాలుగింట్లో(Lok Sabha Seats) వరంగల్‌ స్థానానికి కడియం శ్రీహరి కుమార్తె కావ్య పేరును పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. అందుకోసమే ఆదివారం కడియం శ్రీహరి పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన నాలుగు లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను ఇవాళ సాయంత్రంకల్లా ఖరారు చేసే అవకాశాలున్నాయి. అందులో భాగంగా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీనే లేదని బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, ఫోన్‌ ట్యాపింగ్‌లతో గులాబీ పార్టీ ప్రతిష్ట మసకబారిందని బీజేపీని సైతం ప్రజలు నమ్మరని ధీమాతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

Also Read : Rahul Gandhi : ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు