MLA Yashaswini Reddy: కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ పర్యటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
MLA Yashaswini Reddy

MLA Yashaswini Reddy

MLA Yashaswini Reddy: పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ పర్యటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందని, ఆయన పర్యటించిన పొలంలో వరుసగా నాలుగు బోర్లు వేయడం అనుమానంగా ఉందన్నారు. పక్కనే ఉన్న పంట పొలంలోని బోరులో నీరు వస్తోంది అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

We’re now on WhatsAppClick to Join

కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. దయాకర్ రావు, హరీష్ రావు, కేసీఆర్ పదిరోజుల వ్యవధిలో ఒకే పొలంలో పర్యటించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పర్యటన అంతా స్క్రిప్టెడ్ అని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో కావాలనే నీటి రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టని కేసీఆర్ ఇక్కడికి రావడం విడ్డూరగా ఉంది. రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు కారు స్తున్నారు అంటూ ఆమె కేసీఆర్ పై మండిపడ్డారు.

Also Read: KCR : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి – కేసీఆర్ డిమాండ్

  Last Updated: 31 Mar 2024, 07:20 PM IST