Congress Ministers: బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ మంత్రులు (Congress Ministers) మరోసారి ఫైర్ అయ్యారు. ముందుగా ఆరోగ్య మంంత్రి దామోదర రాజనర్సింహ మాట్టాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాలు నిరంకుశ పాలన చూశాం. ఆర్ అండ ఆర్ ప్యాకేజీ కాంగ్రెస్ ఇచ్చింది. తిరిగి కాంగ్రెసే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ప్రతిపక్షం హింస, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పదేండ్లలలో మాటలతోనే కాలం వెల్లదీశారు. చేనేత కార్మికుల పాత బకాయిలు తీర్చుతూనే వారి జీవితాలలో వెలుగు నింపేలా చేయూత అందిస్తాం. స్కిల్ యూనివర్శిటీ ప్రారంభించాం. చేనేత సమస్యలను పరిష్కారం చూపుతామన్నారు. డెభ్భైలక్షల మంది రైతులు పండించిన పంటలను కొంటున్నాం. దేశంలోనే మన తెలంగాణలో ఈసారి ఎక్కువ పంట పండించాం. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీకి తేదీలని ప్రకటిస్తామన్నారు. నేతన్నలకి, రైతన్నల కోసం పనిచేసే ప్రభుత్వం మాది అని వివరించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని నేరవేర్చుతున్నాం. నిర్వాసితులకి ఇళ్లు ఇస్తానని మొండి చెయ్యి చూపాడు నాటి ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంకి సంవత్సరానికి నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం. పేదవాడు అయితే చాలు పార్టీలకి అతితంగా ఇరవై లక్షల ఇండ్లు కట్టి తీరుతాం. ఇందిరమ్మ ఇండ్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. రూ. 250 కోట్లతో మిడ్ మానేర్ ముంపు బాధితులకి ఇండ్లు కట్టి తీరుతాం. ధరణి పేరుతో విదేశి సంస్థకి తాకట్టు పెట్టింది. స్వదేశి సంస్థ NIC అప్ప జెప్పాం. దేశానికి రోల్ మోడల్ గా మన రాష్ట్రంలోనే రెవెన్యూ చట్టం రాబోతుందన్నారు.
Also Read: YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్ జగన్.. గంటసేపు అక్కడే?
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నిత్యాన్నదాన సత్రానికి నిధులు కెటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. శివుడుకి కూడా శఠగోపం పెట్టినవాడు నాటి ముఖ్యమంత్రి. మాటల ప్రకారం ముంపు గ్రామాల పక్షాన నిలబడ్డాం. నేతన్నల సంక్షేమం ఉపాది కోసం బృహత్తర కార్యక్రమం రూపోందిస్తున్నాం. నిరంతరం వేములవాడ అలయంలో నిత్యాన్నదాన సత్రం కొనసాగుతుందన్నారు.
మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా కాలం నుండి భక్తులు వేములవాడ అభివృద్ధి కొరకు ఎదురుచూస్తున్నారు. వేములవాడలో ఈరోజు వెయ్యి కోట్ల పనులు జరుగబోతున్నాయి. మన ప్రభుత్వం హయంలో ఏడాది కాలంలో అతి ఎక్కువ వరి పంట భారతదేశం లో పండింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క చుక్క నీరు లేకుండానే పంట పండింది. ఈసారే అతి భారీ వరి పంట పండింది. 153 లక్షల మెట్రిక్ టన్నుల వరిపంట పండింది. ఏడాది కాలంలో 50000 ఉద్యోగాలు ఇచ్చాం. పదుల వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. చెప్పిన విధంగా రుణమాఫీ అమలు చేసాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు మరిన్ని మంజూరు చేస్తాం. సన్నరకం వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం. రెండు నెలలలో రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వబోతున్నాంమన్నారు.