Congress List : కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పైఎత్తు! నెలాఖ‌రులోగా 119 అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌?

Congress List : కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మార్చేస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ‌తిరిగేలా చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతుంది.

  • Written By:
  • Updated On - August 24, 2023 / 01:36 PM IST

Congress List : కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మార్చేస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ‌తిరిగేలా చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతుంది. సిట్టింగ్ లు ఏడుగురికి మిన‌హా 115 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ కు దూకుడుకు క‌ళ్లెం వేయ‌నుంది. ఆయ‌న ప్ర‌క‌టించిన స్థానాల్లో కొన్ని మార్పులు చేయ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అందులో మ‌ల్కాజ్ గిరి అసెంబ్లీ  నుంచి  మైనం ప‌ల్లి హనుమంత‌రావు ఎపిసోడ్ ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది. దీనితో ప‌లు ప‌లు చోట్ల అభ్య‌ర్థుల‌ను ఎన్నికల చివ‌రి ఘ‌ట్టంలో మార్చేసే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. స‌రిగ్గా ఈ పాయింట్ వ‌ద్ద కాంగ్రెస్ పార్టీ (Congress List)  కేసీఆర్ మీద పైచేయి సాధించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.

నెలాఖ‌రులోగా 119 అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌ (Congress List)

వాస్త‌వంగా ఈనెలాఖ‌రుకు మొద‌టి జాబితాను 40 నుంచి 45 మంది అభ్య‌ర్థుల‌తో ప్ర‌క‌టించాల‌ని కాంగ్రెస్ తొలుత భావించింది. కానీ, ఒకేసారి 119 మంది స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను (Congress List) ప్ర‌క‌టించ‌డానికి కస‌ర‌త్తు జ‌రుగుతోంది. ఆ మేర‌కు వార్ రూమ్ ఇంచార్జిగా ఉన్న శ‌శికాంత్ సెంథిల్, సునీల్ క‌నుగోలు ప్రాథ‌మికంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే గెలుపు గుర్రాల మీద ఒక అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వ‌చ్చేసింది. మూడు ర‌కాల స‌ర్వే రిపోర్ట్ లు అధిష్టానం వ‌ద్ద ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ టీమ్ ఒక స‌ర్వేను చేసింది. అంతేకాదు, ప్రియాంక కోట‌రీ మ‌రో స‌ర్వేను చేయించింద‌ని టాక్‌. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న సునీల్, వార్ రూమ్ ఇంచార్జి సెంథిల్ చేసిన మ‌రో స‌ర్వే కాంగ్రెస్ అధిష్టానం వ‌ద్ద ఉంది. ఆ మూడింటినీ క్రోడీక‌రించిన త‌రువాత 119 స్థానాల్లో అభ్య‌ర్థుల విష‌యంలో ఒక అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

రాజ‌కీయ గ్లామ‌ర్ సోషల్ మీడియాలో ఫుల్ గా ఉన్న రేవంత్ రెడ్డి

ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఒకేసారి (Congress List) అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఆ విధంగా రికార్డ్ సృష్టించాల‌ని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి చాల బ‌ల‌మైన లీడ‌ర్ గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఆ కార‌ణంగా ఎక్క‌డా అసంతృప్తి క‌నిపించ‌కుండా చేయ‌గ‌లిగారు. ఫ‌లితంగా 2009 ఎన్నిక‌ల్లో రెండోసారి అధికారంలోకి వైఎస్ వ‌చ్చార‌ని అప్ప‌ట్లో వినిపించిన మాట‌. అదే త‌ర‌హాలో ఇప్పుడు రాజ‌కీయ గ్లామ‌ర్ సోషల్ మీడియాలో ఫుల్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఒకేసారి అభ్య‌ర్థుల జాబితాల‌ను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

కేసీఆర్ మీద పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పైచేయి(Congress List) 

స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల విష‌యంలో ఇప్ప‌టికే కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పైచేయి సాధించారు. సిట్టింగ్ లు అంద‌రికీ టిక్కెట్ల ఇవ్వ‌డం ద్వారా ఎన్నిక‌ల‌కు రావాల‌ని కేసీఆర్ కు ఆయ‌న విసిరిన తొలి సవాల్. కేవ‌లం గ‌జ్వేల్ నుంచి పోటీ చేయాల‌ని కేసీఆర్ కు విసిరిన రెండో స‌వాల్. ఆ రెండు స‌వాళ్ల‌ను కేసీఆర్ స్వీక‌రించ‌లేక‌పోయారు. రాబోవు ఎన్నిక‌ల్లో పోటీ చేయడానికి రెండు నియోజ‌క‌వ‌ర్గాలను ఎంచుకున్నారు. సిట్టింగ్ స్థానం గ‌జ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా ఆయ‌న పోటీకి దిగుతున్నారు. ఇక సిట్టింగ్ లు ఏడుగురికి టిక్కెట్ల‌ను ఇవ్వ‌కుండా ప‌క్క‌కు త‌ప్పించారు. రాబోవు రోజుల్లో మ‌రికొంద‌రిని కూడా ప‌క్క‌న పెట్టేందుకు కేసీఆర్ సిద్ద‌మ‌వుతున్నారు. స‌రిగ్గా ఈ రెండు పాయింట్ల వ‌ద్ద కేసీఆర్ మీద పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి(Congress List)  పైచేయిగా నిలిచారు.

Also Read : T Congress Candidates: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు స‌వాల్ విసురుతున్నారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌మునుపే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన పార్టీగా బీఆర్ఎస్ ను ఫోక‌స్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే ద‌మ్ము ఉందా? అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకే, ఒకేసారి 119 స్థానాల్లో అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా కేసీఆర్ స‌వాల్ కు ధీటుగా స‌మాధానం చెప్పాల‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈనెలాఖ‌రులోగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా కేసీఆర్ మైండ్ పోయే ఎత్తుగ‌డ‌ను రేవంత్ టీమ్ ర‌చిస్తోంది.

Also Read : T Congress New Strategy : తెలంగాణ కాంగ్రెస్ కు `సెంథిల్` బూస్ట‌ప్! ష‌ర్మిల హైలెట్ !

ఈనెల 26న ఏఐసీసీ చీఫ్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే తెలంగాణ‌కు రాబోతున్నారు. ఆ రోజున అభ్య‌ర్థుల ఖారారు విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. చేవెళ్ల వేదిక‌గా ఎస్సీ డిక్ల‌రేష‌న్ ను ప్ర‌క‌టించ‌డం ద్వారా రాజ‌కీయ మైలేజి ని పెంచుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. దానితో పాటు బీసీ, ఎస్టీ , మ‌హిళ డిక్ల‌రేష‌న్ల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు క‌ర్ణాట‌క ఫార్ములాను వేగంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్లాల‌ని కాంగ్రెస్ వ్యూహాల‌ను ర‌చిస్తోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి దూకుడు కేసీఆర్ కు చ‌మ‌ట‌లు ప‌ట్టించేలా ఉంటుంద‌ని ఆయ‌న వ‌ర్గీయుల్లోని విశ్వాసం. అదే జ‌రిగితే, స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని రేవంత్ రెడ్డి మ‌రిపించిన‌ట్టే.!