Chikoti-Chinna Jeeyaar Issue: `చిక్కోటి, జీయ‌ర్` పై కాంగ్రెస్ క్లూ!

క్యాసినో కింగ్ చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్, ఆధ్యాత్మిక‌వేత్త చిన‌జీయ‌ర్ స్వామి మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటి? కారులో వాళ్లిద్ద‌రూ ప్ర‌యాణించిన వీడియో వెనుక ర‌హ‌స్యాలు ఏమిటి?

  • Written By:
  • Updated On - August 3, 2022 / 02:26 PM IST

క్యాసినో కింగ్ చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్, ఆధ్యాత్మిక‌వేత్త చిన‌జీయ‌ర్ స్వామి మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటి? కారులో వాళ్లిద్ద‌రూ ప్ర‌యాణించిన వీడియో వెనుక ర‌హ‌స్యాలు ఏమిటి? జీయ‌ర్ ను ఈడీ విచారించాల‌ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తుంది? క‌ల్వ‌కుంట్ల కుటుంబం, చిన జియ‌ర్ ఆశ్ర‌మానికి, చిక్కోటి ప్ర‌వీణ్ కు లింకులు ఉన్నాయా? ఇలాంటి దుమారం ఇప్పుడు స‌ర్వ‌త్రా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ల మ‌ధ్య న‌లుగుతోన్న పెద్ద చ‌ర్చ‌.

పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ఏఐసీసీ మెంబ‌ర్ బ‌క్కా జ‌డ్స‌న్ మంగ‌ళ‌వారం నాడు ఈడీకి ఇచ్చిన ఫిర్యాదు సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఆయ‌న ఈడీకి ఇచ్చిన కొన్ని ఆధారాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాదు, ఎమ్మెల్సీ క‌విత అమెరికాకు వెళ్ల‌డం, కేసీఆర్ కు కాలు ఫ్యాక్చ‌ర్ , జీయ‌ర్ ఆశ్ర‌మానికి క్యాసినో కింగ్ చిక్కోటికి ముడిపెడుతూ ఫిర్యాదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలోనూ బ‌క్కా జ‌డ్స‌న్ ప‌లుమార్లు క‌ల్వ‌కుంట్ల కుటుంబీకుల ఆస్తుల‌పై సీబీఐ, ఈడీల‌కు ఫిర్యాదు చేశారు. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు, జీయ‌ర్ ఆశ్ర‌మానికి ఉన్న సంబంధాన్ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు చిక్కోటి ప్ర‌వీణ్ మ‌నీలాండ‌రింగ్ అంశానికి క‌ల్వ‌కుంట్ల‌, జీయ‌ర్ ఆశ్ర‌మం లావాదేవీల‌కు ముడిపెడుతూ ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read:  Google Warning: గూగుల్ లో ఉన్నది ఎందరో.. పనిచేసేది కొందరే : సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు

క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యుల ఆస్తుల గురించి 500 పేజీలతో కూడిన ఫిర్యాదును రెండు నెల‌ల క్రితం ఈడీకి జ‌డ్స‌న్ అందించారు. ఆయ‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌తో న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. సీబీఐ అధికారుల‌ను క‌లిసి ఆయ‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను అందించారు. తాజాగా జీయ‌ర్, చిక్కోటికి ఉన్న లింకుల‌పై అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. వాళ్లిద్ద‌రూ క‌లిసి ఒకే కారులో ప్ర‌యాణించిన అంశాన్ని బేరేజు వేస్తూ హ‌వాలా వ్య‌వ‌హారం ఇద్ద‌రి మ‌ధ్య న‌డిచింద‌ని అనుమానిస్తున్నారు. సాన్నిహిత్యంగా ఉంటోన్న వాళ్లిద్ద‌రికి సంబంధించిన ర‌హ‌స్యాల‌ను బ‌య‌ట‌కు తీయాల‌ని ఈడీని డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ఈడీ స్పందించ‌క‌పోతే, న్యాయపోరాటం చేస్తాన‌ని జ‌డ్స‌న్ మీడియా ఎదుట వెల్ల‌డించారు.

ఒక వేళ జీయ‌ర్ ను విచారించ‌క‌పోతే ఈడీ ఆఫీస్ ఎదుట ధ‌ర్నాకు దిగ‌డానికి జ‌డ్స‌న్ సిద్ధం అవుతున్నారు. గ‌తంలోనూ జీయ‌ర్ ఆశ్ర‌మంపై ప్ర‌ముఖ సినీ నిర్మాత అశ్వ‌నీద‌త్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. సీబీఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని కూడా డిమాండ్ చేశారు. కానీ, ద‌ర్యాప్తు సంస్ధ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఆ విష‌యాన్ని గుర్తు చేస్తోన్న జ‌డ్స‌న్ ఈసారి ఈడీ స్పందించ‌క‌పోతే, న్యాయ‌పోరాటం చేస్తాన‌ని హెచ్చ‌రిస్తున్నారు. అంతేకాదు, జీయ‌ర్ విచార‌ణ‌కు పిలిచే వ‌ర‌కు ఈడీ ఆఫీస్ ఎదుట ధ‌ర్నాకు దిగుతాన‌ని వెల్ల‌డించ‌డం గ‌మనార్హం.

గ‌త నాలుగు రోజులుగా చిక్కోటి ప్ర‌వీణ్ కుమార్ ను ఈడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న పార్ట‌న‌ర్ మాధ‌వ‌రెడ్డి, సంప‌త్ ల‌ను కూడా విచారిస్తోంది. వాళ్ల నుంచి హ‌వాల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. కొంద‌రు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు చిక్కోటి హ‌వాలా వ్య‌వ‌హారంలో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వాళ్ళలో కొంద‌రికి ఈడీ నోటీసులు ఇచ్చార‌ని స‌మాచారం. ఒకే కారులో సాన్నిహిత్యంగా ప్ర‌యాణిస్తోన్న ప్ర‌వీణ్‌, జీయ‌ర్ వీడియో ఆధారంగా చిక్కోటి వ్య‌వ‌హారం మ‌రో మ‌లుపు తిర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

Also Read:  CM Bommai : సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్న బొమ్మై.. కొత్త ప‌థ‌కాలు ప్ర‌క‌ట‌న‌

మంత్రులతో కుమ్మక్కు?
నగరంలో క్యాసినో లావాదేవీలకు సంబంధించిన ED దాడుల తర్వాత ప్రవీణ్ ప్రాముఖ్యతను పొందాడు. ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు మరియు సినీ తారలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. అధికారులు కూడా ప్రముఖుల పేర్లను వెల్లడించేందుకు ప్రయత్నించినా పెద్దగా విజయం సాధించలేకపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పెద్దలతో సంబంధాలున్నాయని కొన్ని వర్గాలు వెల్లడించాయి. గ్యాంబ్లింగ్ సిండికేట్‌కు సంబంధించిన వ్యవహారాలను రహస్యంగా ఉంచడంలో ప్రవీణ్‌కి రెండు రాష్ట్రాల మంత్రులు సహాయం చేస్తారని అనుమానిస్తున్నారు.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ఉల్లంఘనకు సంబంధించి విచారణకు పిలిచిన చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డిల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కొంత స‌మాచారాన్ని రాబ‌ట్టారు. ప్రవీణ్, మాధవతో పాటు మరో ముగ్గురికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది – బాబూ లాల్, రవిశంకర్, సంపత్. రైల్వే కాంట్రాక్టర్ నివాసంపై ఇటీవల దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు, అయితే అధికారులు ఎటువంటి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. తాజాగా కాంగ్రెస్ లీడ‌ర్ జ‌డ్స‌న్ ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకుని జియ‌ర్ ను ఈడీ ప్ర‌శ్నించ‌డానికి సాహ‌సం చేస్తుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Also Read:  Anand Mahendra Tweet: మహీంద్రా కారు కొని బ్లెస్సింగ్స్ అడిగిన వ్యక్తికి.. ఆనంద్‌ మహీంద్ర రిప్లై!!