Site icon HashtagU Telugu

Hyderabad: కాంగ్రెస్‌‌కు బిగ్ షాక్..

Hyderabad (12)

Hyderabad (12)

Hyderabad: ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. మల్కాజిగిరి కాంగ్రెస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ కు రాజీనామా చేయగా.. ఈ రోజు బుధవారం ఆయన మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో శ్రీధర్ కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. శ్రీధర్ చాలా కాలంగా మల్కాజిగిరి సీటుపై కన్నేశారు. మైనంపల్లి హనుమంతరావుని కాంగ్రెస్ లో చేర్చుకోవడం, ఆయనకు రెండు సీట్లు ఇవ్వడం నందికంటి శ్రీధర్ కు నచ్చలేదు. మల్కాజిగిరి టికెట్ తనకే వస్తుందని నందికంటి శ్రీధర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ ఆశలపై కాంగ్రెస్ పెద్దలు నీళ్లు చల్లారు ఈ కారణంతోనే ఆయన కాంగ్రెస్ కు గుడ్ బాయ్ చెప్పాడు.

మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్‌ నేతల సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు. ఇక శ్రీధర్‌ బీఆర్‌ఎస్‌ చేరిక మల్కాజిగిరి నియోజకవర్గ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. శ్రీధర్‌కు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటి రామారావు ఘనస్వాగతం పలికారు.శ్రీధర్ కృషికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి నియోజక వర్గంలోని బీఆర్‌ఎస్ నాయకులందరూ సంఘటితంగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Also Read: NTR Silent: ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య రియాక్షన్.. ఐ డోంట్ కేర్