ఖమ్మం జిల్లా కల్లూరు(Kalluru)లో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నేత రాయల రాము (Rayala Ramu) మద్యం మత్తులో ఓ హోటల్‌కి వచ్చి అక్కడి సిబ్బందితో పరోటా విషయంలో వాగ్వాదానికి దిగాడు. గొడవ ముదరడంతో తన అనుచరులకు సమాచారం ఇవ్వగా, పెద్ద సంఖ్యలో వారు కల్లూరుకు చేరుకుని హల్‌చల్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో కల్లూరు ఎస్‌ఐ హరిత (Kallur SI Haritha) ఘటనాస్థలికి చేరారు.
Pahalgam Attack: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్‌లో!
ఎస్‌ఐ హరిత పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి యత్నించినా, రాయల రాము మరియు అతని అనుచరులు పోలీసుల మాట వినకుండా రెచ్చిపోయారు. మహిళా ఎస్‌ఐతో రాయల రాము, అతని అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. పరుష పదజాలంతో ఆమెను దూషించడమే కాకుండా, రాము నేరుగా ఎస్‌ఐ హరిత ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశాడు. ఇది చూస్తున్న ప్రజలు షాక్‌కి గురయ్యారు. అధికార దుర్వినియోగం, మద్యం మత్తుతో మహిళా పోలీస్ అధికారిని అవమానించిన రాయల రాము చర్యలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
పోలీసులు వెంటనే స్పందించి రాయల రాము సహా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళా పోలీస్ అధికారిపై జరిగిన ఈ దాడి పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకుల నుండి ఇటువంటి ప్రవర్తన దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఫుల్లుగా తాగి డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐని కొట్టిన కాంగ్రెస్ నేత
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తిరువూరు క్రాస్ రోడ్ వద్ద మద్యం మత్తులో కాంగ్రెస్ నేత వీరంగం
ఓ హోటల్ పై దాడి, ముప్పై మంది యువకులతో కలిసి గలాటా
అడ్డుకోబోయిన ఎస్‌ఐపై దాడి చేసిన కాంగ్రెస్ నేత రాయల రాము, అతని అనుచరులు pic.twitter.com/UMJOc5asEW
— TNews Telugu (@TNewsTelugu) June 7, 2025