Site icon HashtagU Telugu

kodandaram : కాంగ్రెస్ తో కోదండరాం పొత్తు..?

kodandaram

kodandaram

తెలంగాణ జన సమితి (TJS) అధ్యక్షులు కోదండరాం (Kodandaram)..కాంగ్రెస్ పార్టీ (Congress Party) తో పొత్తు పెట్టుకుంటున్నారా..? లేక తన తెలంగాణ జన సమితి పార్టీని కాంగ్రెస్ లో కలపబోతున్నారా..? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. మరో రెండు నెలల్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పలువురు రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందనే ఆలోచన చేస్తూ అందులో చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లో పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు చేరుతున్నారు. ఇప్పటికే బీర్ఎస్ (BRS) నుండి పలువురు కీలక నేతలు చేరగా ..త్వరలో మరికొంతమంది చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే బిజెపి నుండి కూడా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కోదండరాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే ను కలిసి పార్టీ కాంగ్రెస్ తో పొత్తు గురించి చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ లో కేసీఆర్ (CM KCR) ను ఓడించడం కొరకు కోదండరాం పాత్ర అవసరమని కాంగ్రెస్ భావిస్తూ తెలంగాణ జన సమితితో పొత్తు కోసం చర్చలు జరిపినట్లుగా పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఈ మేరకు కోదండరాం ఆరు సీట్లనూ తమ పార్టీ అభ్యర్థుల కేటాయించాలని ఆ లిస్టును థాక్రేకు తెలియజేసినట్లు తెలుస్తుంది. మరి కోదండరాం అడిగినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఆరు సీట్లు ఆ పార్టీకి ఇస్తుందా..? అసలు కోదండరాం చెప్పిన ఆ ఆరు స్థానాలు ఎక్కడివి..? కోదండరాం కు ఆ ఆరు స్థానాలు ఇస్తే..అక్కడి కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : 2023 Congress Candidates List : కాంగ్రెస్ ఫైనల్ చేసిన ఫస్ట్ 62 మంది అభ్యర్థులు వీరేనా..?