Site icon HashtagU Telugu

Revanth Reddy: కొడంగల్ లో కాంగ్రెస్ జోరు.. రేవంత్ కు 8 వేల ఓట్ల లీడింగ్!

Revanth Dharani

Revanth Dharani

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ లో దూసుకుపోతున్నారు. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసినా ఆయన ఓటమీ పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుండటంతో కొడంగల్ 7 రౌండ్లు పూర్తయ్యే సరికి 8 వేల ఓట్లతో కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

అయితే రేవంత్ ను ఓడిస్తామని బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, కేటీఆర్ సైతం తేల్చి చెప్పినా పాచిక పారలేదు. అందుకు భిన్నంగా ఈసారి కొడంగల్ లో రేవంత్ తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొడంగల్ తన అడ్డా అని రేవంత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్తులు లీడ్ లో ఉండటంతో హైదరాబాద్ లో రేవంత్ ఇంటి దగ్గర సంబురాలు మొదలయ్యాయి.

టోటల్…సీట్స్…119

కాంగ్రెస్…66

బి ఆర్ ఎస్…40

బీజేపీ…..6

ఎంఐఎం…4

ఇతరుల లు…1

రాజస్థాన్….మొత్తం..199

బీజేపీ…107

కాంగ్రెస్…83

మధ్యప్రదేశ్…230

బీజేపీ..132

కాంగ్రెస్..97

ఇతరులు..4

ఛతీస్ గడ్….90

బీజేపీ…47

కాంగ్రెస్…40

Also Read: AP Trains: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 144 రైళ్లు రద్దు