TCongress: టికెట్ల లొల్లిపై కాంగ్రెస్ సీరియస్.. ఆ ఇద్దరు సస్పెండ్!

నాయకులపై అనుచిత వ్యాఖ్యలను చేయడం లాంటి చర్యలను క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా పరిగణించింది. 

  • Written By:
  • Updated On - October 16, 2023 / 05:53 PM IST

కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్వాల్ టికెట్ ఆశించిన కురువ విజయకుమార్ ను, బహదూర్ పూర నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన కలీమ్ బాబా లను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశమైన కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రాలేదన్న ఆక్రోశంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి గాంధీ భవన్ లో పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, ఫ్లెక్సీలను చించి వేయడం, నాయకులపై అనుచిత వ్యాఖ్యలను చేయడం లాంటి చర్యలను క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా పరిగణించింది.

‘‘పార్టీ టికెట్ల కేటాయింపు ఏఐసీసీ నియమ నిబంధనల ప్రకారం జరుగుతుంది. టికెట్ల కేటాయింపు పూర్తిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయాధికారం ప్రకారం కేటాయింపు ఉంటుంది. టికెట్ల కేటాయింపు లో ఒక్కరి బాధ్యత ఉండదు. టికెట్ల విషయంలో పీసీసీ అధ్యక్షులను ఒక్కడినే బాధ్యత చేయడం కక్షతో కూడిన చర్యగా క్రమశిక్షణా కమిటీ భావించింది’’ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: AP BRS: ఏపీలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర