Site icon HashtagU Telugu

Congress Govt : కాంగ్రెస్ పనైపోయింది – హరీష్ రావు

Harish Rao

Harish Rao

కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress Vs BRS) మధ్య రోజు రోజుకు వేడి పెరుగుతోంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తన రజతోత్సవ సభను (BRS party holds its silver jubilee meeting) గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. వరంగల్ (Warangal) నగరాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుని భారీ సభ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు వరంగల్ అనుబంధమైన ప్రదేశమని, ఇక్కడే రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని అనుసరిస్తోందని పేర్కొన్నారు.

Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసు.. ఉరిశిక్ష పడిన సుభాష్‌శర్మ వివరాలివీ

కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఎవరు సమర్థులు, ఎవరు అసమర్థులు అన్న విషయం స్పష్టమైందన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో, రేవంత్ రెడ్డిపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని హరీష్ రావు విమర్శించారు. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేకపోతుందన్న విషయం ప్రజలకు అర్థమైందని, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేసారు.

వరంగల్ సభను లక్షలాది మందితో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించిందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ కోసం 14ఏళ్ల ఉద్యమం, 9ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సభ ముఖ్యమైనదని చెప్పారు. వరంగల్ సభ విజయవంతం అయితే, అది బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే బాటను మరింత దృఢంగా చేస్తుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు.