MLC Elections : కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది – మంత్రి శ్రీధర్ బాబు

MLC Elections : గత 10 ఏళ్లలో పట్టభద్రులు మోసపోయారని, ఇప్పుడు వారంతా తమపై నమ్మకంతో ఉన్నారని

Published By: HashtagU Telugu Desk
Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు (MInister Sridhar Babu) మాట్లాడుతూ.. కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో పట్టభద్రులు మోసపోయారని, ఇప్పుడు వారంతా తమపై నమ్మకంతో ఉన్నారని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు ఇప్పటికే 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, తొలిసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత తమదేనని చెప్పారు.

Rowdy Baby Step: రౌడీ బేబీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన ధనుష్,ప్రభుదేవా.. నెట్టింట వీడియో వైరల్!

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వ పాలనలో గాడి తప్పిందని, తమ ప్రభుత్వం వచ్చాక మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. 317 జీవో విషయంలో బీజేపీ రెండు రకాల మాటలు మాట్లాడుతోందని, ముందుగా ఆ జీవో ఆమోదించి ఇప్పుడు వ్యతిరేకించడం దారుణమని ఆయన విమర్శించారు. డీఎస్సీ ద్వారా 10,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను పెంచుతున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ విధానం ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బలహీన వర్గాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపడుతోందని, దీనిపై బీజేపీ తన వైఖరి స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Liquor : తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్

మరోపక్క బీజేపీ కూడా గెలుపు కోసం గట్టిగానే కృషి చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెదక్, ఖమ్మం జిల్లాల్లో ప్రచారం చేస్తుండగా, బండి సంజయ్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే గుట్టు చప్పుడు కాకుండా కలిసి పనిచేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కై తమను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కీలక మలుపు తీసుకోబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  Last Updated: 23 Feb 2025, 01:15 PM IST