Site icon HashtagU Telugu

BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు: రామచందర్ రావు

Congress has no moral right to speak on Kamareddy land: Ramachandra Rao

Congress has no moral right to speak on Kamareddy land: Ramachandra Rao

BJP : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని నడిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభను కాంగ్రెస్ నాటకంగా మలచిందని ఆయన ఆరోపించారు. బీసీలకు న్యాయం చేస్తామనే పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్‌ను ప్రకటించకుండా, మాటల మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతోంది. కామారెడ్డి గడ్డ మీద బీసీల రిజర్వేషన్ పేరుతో మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు అని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీ వర్గాలపై రాజకీయ లబ్దికోసం దురుద్దేశపూరితంగా పని చేస్తోందని విమర్శించారు. నిజమైన బీసీ సంక్షేమం అంటే మాటలు కాదు, కార్యాచరణ ఉండాలన్నారు. గతంలో బీజేపీ హయాంలో బీసీల కోసం తీసుకున్న పలు సంకల్పాలను ఆయన గుర్తుచేశారు. ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలోనూ రామచందర్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సమయానికి పంచాయతీ ఎన్నికలు జరిపించకపోవడం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.3వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఇది సీరియస్ అంశం. గ్రామీణ అభివృద్ధికి ఆర్థికంగా భారీ దెబ్బ తగిలింది అని ఆయన వివరించారు.

తెలంగాణ విమోచన దినోత్సవం నేపథ్యంలో సెప్టెంబర్ 17న జరగనున్న వేడుకల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సెప్టెంబర్ 17న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణకు వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ మట్టికి సేవలందించిన నాయకుడికి ఇది మా ఘన నివాళి అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ నైతిక విలువలు, అభివృద్ధి విధానాల పట్ల విశ్వాసం ఉంచాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు.  బీసీలను మోసం చేసే పార్టీల మాయాజాలం బహిర్గతం అవుతుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తిరుగుండదు  అని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Uttarakhand : నకిలీ బాబాలపై ఉక్కుపాదం..‘ఆపరేషన్ కాలనేమి’తో 14 మంది అరెస్టు