ప్రభుత్వం (Govt) మారిందంటే చాలు..గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల్లో మార్పులు చేర్పులు చేయడం కామన్. ఇప్పుడు తెలంగాణ (Telangana) లో కూడా అదే జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల పేర్ల మార్పులు , రాష్ట్ర చిహ్నాలు మార్చడం వంటివి చేస్తుంది. రైతుబంధును రైతు భరోసాగా, ధరణి పోర్టల్ పేరును భూమాత పోర్టల్‌గా, డబుల్ బెడ్రూం ఇళ్ల స్కీమ్ పేరు ఇందిరమ్మ ఇండ్లుగా మార్చింది.
ఇక కేసీఆర్ కిట్ పేరును మదర్ అండ్ చైల్డ్ హెల్త్‌గా మారిపోయింది. ఇక కల్యాణలక్ష్మి స్కీమ్‌కు సైతం కొత్త పేరు పెట్టే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. ఇక ఇప్పుడు మరో పథకం పేరు మార్చబోతున్నట్లు తెలుస్తుంది. ఏటా పచ్చదనం పెంపునకు అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం (Haritaharam) పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిర వనప్రభ’ (Indira Vanaprabha)గా మార్చనున్నట్లు సమాచారం. వర్షా కాలం ప్రారంభం తోటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది. కానీ ఇప్పుడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కలుపుతూ ఇందిర వనప్రభగా ఖరారు చేసినట్లు తెలిసింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా 2015 జులై 3న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులో హరితహారం పథకాన్ని ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. గడిచిన 9 ఏళ్లలో ఈ పథకం కింద దాదాపు 280 కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. గ్రామాల్లో ఈ స్కీమ్ కింద నర్సరీలతో పాటు ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు.
Read Also : Prajwal Revanna: ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. వాట్ నెక్స్ట్..?
