ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) పార్టీ..బిఆర్ఎస్ (BRS) కు సంబదించిన ఏ చిన్న లీకేజ్ (Leakage) ను వదిలిపెట్టడం లేదు. స్కామ్ లు , ప్రాజెక్ట్ ల పేరుతో లక్షల కోట్లు దోచుకోవడం..పేదలకు అందని పధకాలు ఇలా అన్నింటిని ప్రచారంలో చెపుతూ ప్రజలకు ఆకట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram project) లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ కు తాజాగా మియాపూర్ (Miyapur ) ఎత్తిపోతల ప్రాజెక్ట్ లీక్ లభించినట్లు అయ్యింది.
We’re now on WhatsApp. Click to Join.
మియాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎక్కడిది అనుకుంటున్నారా..? హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో ఓ పైప్‌లైన్ పగిలి నీరు పెద్ద ఎత్తున పైకి ఎగజిమ్ముతో… చూడ్డానికి జలపాతంలా కనిపించింది. దీనిని చూసిన ఓ వ్యక్తి తన ఫోన్ తో వీడియో తీసి..తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ‘మియాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్’ అని దానికి క్యాప్షన్ పెట్టాడు. దీనిని టి కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కట్టిన నాలుగేండ్లకే ప్రాజెక్టులు కుంగుతాయని, వేసిన పైపులైన్లు ఐదేండ్లకే పగులుతాయని విరుచుకుపడింది. ప్రజాధనమంటే లెక్కలేకుండా పోయిందని, పాలనలో చిత్తశుద్ధి, పనుల్లో నాణ్యత లేవని విమర్శించింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఇష్టం లేదని, ప్రజా సంక్షేమమంటే పట్టింపే లేదని తెలుపుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.
మియాపూర్ జలపాతం
“కట్టిన ప్రాజెక్టులు నాలుగేండ్లకే కుంగుతాయి , వేసిన పైపులైన్లు ఐదెండ్లకే పగులుతాయి”
ప్రజాధనం అంటే లెక్క లేదు, పాలనలో చిత్తశుద్ధి లేదు , చేసే పనుల్లో నాణ్యత లేదు.ఈ BRS ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఇష్టం లేదు, ప్రజా సంక్షేమమంటే అస్సలు పట్టింపే లేదు “ #ByeByeKCR pic.twitter.com/fa1yGpYfxP
— Arunkumar Balabadri (@balabadriarun) November 23, 2023
Read Also : Teenmar Mallanna : బిఆర్ఎస్ లోకి తీన్మార్ మల్లన్న..ఏమన్నా మార్ఫింగా..?