Site icon HashtagU Telugu

Congress Final List : చివరి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. పటాన్ చెరు అభ్యర్థి మార్పు

Jai Congress

Jai Congress

రేపు నామినేషన్ల పర్వం ముగుస్తున్న తరుణంలో టి కాంగ్రెస్ (T Congress) పెండింగ్ లో ఉన్న స్థానాలకు సంబదించిన అభ్యర్థులను (Final List) గురువారం రాత్రి ప్రకటించింది. కాకపోతే పటాన్ చెరు అభ్యర్థి (Congress Patancheru Candidate) విషయంలో షాక్ ఇచ్చింది. ముందుగా ఈ స్థానంలో నీలం మధు (Neelam Madhu) పేరును ప్రకటించినప్పటికీ, అతడికి బీ ఫాం ఇవ్వలేదు. తాజాగా ఈ స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) కు టికెట్ కేటాయించారు. అలాగే సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి ఇచ్చింది. ఈ స్థానం కోసం టీపీసీసీ నేత పటేల్ రమేశ్ రెడ్డి గట్టిగా పట్టుబడినప్పటికీ..చివరకు అధిష్టానం దామోదర్ రెడ్డి కే మొగ్గు చూపించింది. అలాగే తుంగతుర్తి ఎస్సీ స్థానాన్ని మందుల శ్యామ్యూల్‌కు అధిష్టానం కేటాయించింది.

పూర్తి అభ్యర్థుల వివరాలు (T Congress Final List) చూస్తే..

తుంగతుర్తి – మందుల సామ్యూల్
పటాన్ చెఱు – కాటా శ్రీనివాస్ గౌడ్
మిర్యాలగూడ – బాతుల లక్ష్మారెడ్డి
సూర్యాపేట రాంరెడ్డి దామోదర్ రెడ్డి
చార్మినార్ – ముజీబ్ షరీఫ్

Read Also : Tamil Nadu: ప్రైవేట్ కాలేజీలో గుండు గీయించి విద్యార్థిని ర్యాగింగ్