Congress Fight : గాంధీభ‌వ‌న్లో టిక్కెట్ల లొల్లి

Congress Fight : తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చారం క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీని ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ వ‌ద‌ల్లేదు.`గో బ్యాక్ నిజామాబాద్`

  • Written By:
  • Updated On - September 4, 2023 / 04:27 PM IST

Congress Fight : తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌చారం క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీని కూడా ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ వ‌ద‌ల్లేదు. ఆయ‌న్ను `గో బ్యాక్ నిజామాబాద్` అనే వ‌ర‌కు తీసుకెళ్లింది. గాంధీభ‌వ‌న్ వేదిక‌గా అభ్య‌ర్థిత్వాల క‌స‌రత్తు జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ సౌడ్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు, కొంద‌రి అభ్య‌ర్థిత్వాల‌ను వ్య‌తిరేకిస్తూ రాత‌పూర్వ‌క ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌ధుయాష్కీ గో బ్యాక్ నిజామాబాద్ (Congress Fight)

రెండుసార్లు ఎంపీగా నిజామాబాద్ నుంచి మ‌ధుయాష్కీ గెలిచారు. అక్క‌డి నుంచే రెండుసార్లు వ‌రుస‌గా ఓడిపోయారు. ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్పుడు ఆయ‌న రెండుసార్లు గెల‌వ‌గా, రాష్ట్రం విడిపోయిన త‌రువాత రెండుసార్లు ఓడిపోవ‌డం విచిత్రం. ప్ర‌త్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చిన నేత‌ల్లో ఆయ‌న ప్ర‌ముఖులు. ఆయ‌న్నే నిజామాబాద్ ప్రజ‌లు ఓడించారు. అంతేకాదు, మూడోసారి కూడా గెలుస్తామ‌న్న న‌మ్మ‌కం లేదు. అందుకే, ప్ర‌త్యామ్నాయాల‌ను చూసుకుంటున్నారు. ఆ క్ర‌మంలో అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని యోచిస్తూ ఎల్బీ న‌గ‌ర్ నుంచి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. ఇక ఆ రోజు నుంచి ఆయ‌న మీద స్థానిక లీడ‌ర్లు అసంతృప్తి (Congress Fight) గ‌ళాన్ని విప్పారు. అది కాస్తా గాంధీభ‌వ‌న్ లో గో బ్యాక్ నిజామాబాద్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వ‌ర‌కు వ‌చ్చింది.

ఎల్బీ న‌గ‌ర్ నుంచి మ‌ధుయాష్కీ 

ఇక వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి వ‌ర్సెస్ స్థానిక లీడ‌ర్ల మ‌ధ్య వార్ జరుగుతోంది. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేస్తున్నారు. అక్క‌డ నుంచి టిక్కెట్ ఆశిస్తోన్న యూత్ కాంగ్రెస్ లీడ‌ర్లు, మండ‌ల స్థాయి నేతలు ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌శ్నిస్తూ బాహాటంగా ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. సీనియ‌ర్ లీడ‌ర్, క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ గా ఉన్న చిన్నారెడ్డికి ప్ర‌స్తుతం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌ద్ధ‌తు ఉంది. అదే సమ‌యంలో అక్క‌డ నుంచి అభ్య‌ర్థిత్వాల‌ను ఆశిస్తోన్న యువ లీడ‌ర్లు చిన్నారెడ్డికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌మంటూ (Congress Fight) తెగేసి చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని గాంధీభవ‌న్ కు వేదిక‌గా చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో ఇవే చివ‌రి ఎన్నిక‌లంటూ చిన్నారెడ్డి మ‌భ్య‌పెట్టార‌ని గుర్తు చేస్తున్నారు. యువ‌త‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ ను ఉటంకిస్తున్నారు.

యువ లీడ‌ర్లు చిన్నారెడ్డికి మ‌ద్ధ‌తు ఇవ్వ‌మంటూ (Congress Fight)

గాంధీభ‌వ‌న్ వేదిక‌గా జూబ్లీహిల్స టిక్కెట్ విష‌యంలో విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ మధ్య వార్ న‌డుస్తోంది. ఇటీవ‌ల జూబ్లీహిల్స్ ప‌రిధిలో ప‌ర్య‌టించ‌డానికి అజ‌రుద్దీన్ వ‌చ్చిన‌ప్పుడు విష్ణు అనుచ‌రులు అడ్డుకున్నారు. అయిన‌ప్ప‌టికీ అజ‌రుద్దీన్ మాత్రం జూబ్లీహిల్స్ నుంచి అభ్య‌ర్థిత్వాన్ని ఆశిస్తూ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో గాంధీభ‌వ‌న్ లోని పీసీసీ అగ్ర‌నేత‌లకు విష్ణు రాత‌పూర్వ ఫిర్యాదు చేశారు. పీజేఆర్ వార‌సునిగా జూబ్లీహిల్స్ త‌న‌కే ద‌క్కాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, అజారుద్దీన్ మాత్రం స‌ర్వేల ఆధారంగా ఎవ‌రు గెలిచే అవ‌కాశం ఉంటే వాళ్ల‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇలా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో భిన్న నాయ‌క‌త్వాలు కాంగ్రెస్ కు (Congress Fight) తల‌నొప్పిగా మారింది.

Also Read : TCongress: టీకాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్న నేతలు

వాస్త‌వానికి ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ ప్ర‌కారం టిక్కెట్ల‌ను కేటాయించాలి. కానీ, దాన్ని అమ‌లు చేస్తే చాలా వ‌ర‌కు వార‌స‌త్వ రాజ‌కీయాలు పోయే అవ‌కాశం ఉంది. అంతేకాదు, యువ‌త‌కు 50శాతం అవ‌కాశం ల‌భిస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ కంటే స‌ర్వేల‌ను బేస్ చేసుకుంటున్నారు. వాటి ఆధారంగా మాత్ర‌మే టిక్కెట్ల‌ను కేటాయించాల‌ని అధిష్టానం నిర్ణ‌యించింది. ఆ స‌ర్వేల్లో వెనుక‌బ‌డిన వాళ్లు సీనియ‌ర్లు అయినా స‌రే ప‌క్క‌న పెట్టేలా కాంగ్రెస్ అధిష్టానం కొంత క‌ఠినంగా ఉంద‌ని క‌ర్ణాట‌క అభ్యర్థిత్వాల ప్ర‌క‌ట‌న తెలియ‌చేస్తోంది.

Also Read : Thummala Joins Congress : తుమ్మల కాంగ్రెస్ లో చేరిక ఫై ఎమ్మెల్యే పొదెం వీరయ్య కీలక వ్యాఖ్యలు

ఖ‌మ్మం జిల్లా పాలేరు అంశంలోనూ గంద‌ర‌గోళం నెల‌కొంది. అక్క‌డ నుంచి పోటీ చేస్తాన‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. అధిష్టానం ఎలాంటి హామీ లేకుండా ఎలా ప్ర‌క‌టిస్తార‌ని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌద‌రి గ‌ళం విప్పారు. ఇంకా వైఎస్సాఆర్ టీపీ విలీనం ప్ర‌క్రియ పూర్తి కాలేదు. కేవ‌లం రాహుల్‌, సోనియాను క‌లిసి ష‌ర్మిల మాట్లాడారు. కాంగ్రెస్ లోకి రావ‌డం మాత్రం ఖ‌రారు అయింది. ఆ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం కూడా సంకేతాలు ఇస్తోంది. అయితే, ఆమె ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు? అనేది మాత్రం ఇతిమిద్ధంగా తెలియ‌డంలేదు. కానీ, ష‌ర్మిల మాత్రం పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని అంటున్నారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సిద్ద‌మ‌వుతున్నారు. ఇలా పారాచూట్ నిబంధ‌న ఇబ్బంది పెడుతోంది. ఉద‌య్ పూర్ డిక్ల‌రేష‌న్ లో పారాచూడ్ అంశం కూడా ఉంది. మొత్తం మీద అభ్య‌ర్థిత్వాల విష‌యంలో కాంగ్రెస్ పార్టీకి స‌వాల్ గా మారింది. ప్ర‌తి రోజూ గాంధీభ‌వ‌న్ వేదిక‌గా ఏదో ఒక నిర‌స‌న క‌నిపిస్తోంది. ఇక జాబితాను ప్ర‌క‌టించిన త‌రువాత ఎలా ఉంటుందో చూడాలి.