Ravula Sridhar Reddy : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం కాంగ్రెస్ నేతలకు ఆనందం కలిగిస్తోందని, రాజకీయ వ్యూహాలకు ఇది భాగమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రసన్నం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి చిల్లరమల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. చామల కిరణ్ రెడ్డి లాంటి బ్రోకర్లు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. కిరణ్ రెడ్డి పేమెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చారని, కేటీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమంలో పని చేసి పదేళ్లుగా మంత్రి పదవిలో ఉన్నారని చెప్పారు.
Tirupati Stampede Incident : ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు
రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక లక్షా 37 వేల కోట్ల అప్పుల్లో ఎవరి వాటా ఎంత ఉందో కాంగ్రెస్ స్పష్టీకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో చామల కిరణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. క్విడ్ ప్రో కో గురించి కూడా తెలియని వారు అనవసరంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు.
కేటీఆర్‌పై కేసులు పెట్టి కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు ఆడుతోందని రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ను విమర్శించి వార్తల్లో ఉండాలని చూస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుగోలు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఫార్ములా ఈ కేసు పూర్తిగా అబద్ధమని, ఈ కేసులో కేటీఆర్‌ను అనవసరంగా లాగారని రావుల శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నదని, కేటీఆర్‌కు ఈ కేసులో క్లిన్ చిట్ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన రావుల శ్రీధర్ రెడ్డి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.
Steve Smith: కమిన్స్‌కు రెస్ట్.. అతని స్థానంలో బాధ్యతలు చేపట్టిన స్టీవ్ స్మిత్!