Electric Scooters Scheme: స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్..!

రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు (Electric Scooters Scheme) ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Best Scooters

Best Scooters

Electric Scooters Scheme: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 118 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తుంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా మరో స్కీమ్‌ అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు (Electric Scooters Scheme) ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉండగా.. పేద విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉన్నారు. కేంద్ర సబ్సిడీ పోను ఒక్కో స్కూటీకి 50 వేల రూపాయల చొప్పున 70 వేల స్కూటీలకు రూ.350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

Also Read: Ayodhya – Hyderabad : మేడిన్ హైదరాబాద్.. అయోధ్య రామమందిరం తలుపుల తయారీ ఇక్కడే

విధివిధానాలు, దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత గ్యారంటీలో భాగంగా ఆరోగ్య శ్రీ బీమా రూ.10 లక్షలకు పెంపు పథకాలను కాంగ్రెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 26 Dec 2023, 11:08 AM IST