Site icon HashtagU Telugu

Congress Candidates : కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం.. బిఆర్ఎస్ కు కలిసొస్తుందా..?

Congress Last List

Congress Last List

అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం నెల రోజులు కూడా లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ (Congress Party) పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులను (Congress Candidates Total List) ప్రకటించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కి పట్టున్న నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా పెండింగ్ లో పెట్టడం..ఆ నియోజకవర్గ కార్యకర్తల్లో ఆగ్రహం నింపుతుంది. ఓ పక్క అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ముందు నుండి దూకుడు చూపిస్తుంటే..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా సైలెంట్ గా ఉంటె ఎలా అని ప్రశ్నింస్తున్నారు.

టికెట్ కోసం ఆశిస్తున్నా వారితో మాట్లాడి..ఏదో ఒకటి తేల్చి ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఇంకా ఏది తేల్చ కుండా వారిని ఎదురుచూసేలా చేయడం..కార్యకర్తల్లో ఆశలు రేపడం ఏంటి అని వారు ప్రశ్నింస్తున్నారు. ఇలాగే చేస్తే మొన్న కేటీఆర్ అన్నట్లు కాంగ్రెస్ సీట్లు పంచెలోపు..మనం గెలిచి స్వీట్స్ పంచుకుంటాం అన్నట్లు అవుతుందని అంటున్నారు. మరోపక్క బిఆర్ఎస్ శ్రేణులు సైతం కాంగ్రెస్ ఎంత సైలెంట్ గా ఉంటె అంత మనకే మంచిది అని , ఈ లోపు మనం ప్రచారం ముమ్మరం చేసి ప్రజలను ఆకట్టుకోవచ్చు..వారి ఓట్లు దండుకోవచ్చు అని అనుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం కాంగ్రెస్ 100 నియోజకవర్గాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించింది..ఇంకా 19 స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరి వారిని ఎప్పుడు ప్రకటిస్తారో..వారు ఎప్పుడు ప్రచారం చేసుకోవాలి..ఆ ప్రకటన తర్వాత టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఎటు వెళ్తారో..? వారు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారో లేదో..? ఇలా అనేక ప్రశ్నలు కార్యకర్తలను వెంటాడుతున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫై ప్రజల్లో నమ్మకం పెరిగినప్పటికీ వారి నమ్మకాన్ని వాడుకోవడం లో కాంగ్రెస్ విఫలం అవుతుంది. ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేయడం..ప్రచారం సైతం పెద్దగా చేయకపోవడం వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. సోనియా ఆరు గ్యారెంటీలను ప్రకటించినప్పటికీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం టీ కాంగ్రెస్ నేతలు విఫలం అవుతున్నారు. ఎంతసేపటికి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి లాక్కుకునే ఆలోచన చేస్తున్నారు కానీ..ప్రజా ఓట్ల ఫై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. వారు ఓటేస్తేనే కాదు వీరు గెలిచేది..అలాంటిది వారినే పట్టించుకోకపోతే ఎలా అని సగటు కార్యకర్త ప్రశ్నింస్తున్నారు. ఇకనైనా ఉన్న ఈ కొద్దీ రోజుల్లోనైనా పార్టీ ప్రచారం ఫై దృష్టి పెట్టి..ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని అంటున్నారు.

Read Also : Election Code: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, పోలీసులు ఎన్ని కోట్లు సీజ్ చేశారో తెలుసా