సంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) పార్టీలు శత్రువులుగా మారాయని బీఆర్‌ఎస్ (BRS) నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇద్దరూ కలిసే ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. “చోటా భాయ్ – బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని” విమర్శించారు.
దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండూ దొందూ దొందే అని అన్నారు. ఒక పార్టీది మోస చరిత్ర (history of betrayal) అయితే, మరొక పార్టీది ద్రోహ చరిత్ర (history of deception) అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా (Zero Allocation) ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రానికి 8 మంది ఎంపీలు గెలిపించినా బీజేపీకి కృతజ్ఞత లేదని ఫైర్ అయ్యారు.
ఈ రోజు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు హరీశ్‌రావు. సంగారెడ్డి జిల్లా జడ్పీ స్థానం బీఆర్‌ఎస్‌దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ జెండా ఎగురుతోందన్నారు.
Also Read: CBN New Look : నయా లుక్ లో సీఎం చంద్రబాబు
ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మభ్యపెడుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినప్పుడు తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ప్రశ్నించారు.
నల్లధనం తీసుకొస్తానన్న హామీ, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న వాగ్దానాలు, బుల్లెట్ రైళ్లు, పేదలందరికీ ఇళ్లు వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. గ్యాస్ ధర, పెట్రోల్ ధర పెరిగిపోయిన తీరు ప్రజలను ఎంతగా భారించిందో వివరించారు.
జీఎస్టీ (GST) ద్వారా సాధారణ వస్తువుల మీద పన్నులు పెంచి ఇప్పుడు తగ్గిస్తున్నట్టు డ్రామాలు చేస్తున్నదీ మోదీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో యూరియా కోసం ఇంతగా రైతులు తిప్పలు పడలేదని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
