2023 Telangana Assembly Polls : మరికొన్ని గ్యారెంటీ హామీలను ప్రకటించిన కాంగ్రెస్..

తెలంగాణలో అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని

  • Written By:
  • Publish Date - October 19, 2023 / 10:06 AM IST

తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పక్క ప్రణాళిక తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీలను (Congress 6 Promises in Telangana) ప్రకటించి ప్రజల్లో ఆసక్తి , నమ్మకం పెంచింది. మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం – రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు మరొకొన్ని హామీలను ములుగు సభ (Congress Mulugu Public Meeting)లో కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మరిన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మరిన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12 లక్షల సాయం అందజేస్తామ‌ని తెలిపారు. అలాగే, ఎస్సీలకు 18 శాతానికి, ఎస్టీలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామ‌ని కూడా ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద భూమిలేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు భూమితోపాటు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.6 లక్షలు అందజేస్తామని చెప్పారు. ప్రతి ఆదివాసీ గ్రామ పంచాయతీకి రూ.25 లక్షల సాయం అందిస్తామని తెలిపారు.

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామనీ, నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి చెల్లిస్తామని , తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని , గల్ఫ్‌ దేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక గల్ఫ్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని ములుగు వేదికగా కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీలతో ప్రజలను , నేతలను ఆకట్టుకుంటున్న కాంగ్రెస్..ఇప్పుడు మరికొన్ని హామీలు ప్రకటించి మరింతగా ప్రజలను ఆకట్టుకుంటుంది. మరి వీటిని ఏ విధంగా ప్రచారం చేసి ఓట్లుగా మలుచుకుంటారనేది చూడాలి.

Read Also : Mulugu Congress Public Meeting : దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు..ములుగు కాంగ్రెస్ సభ హైలైట్స్