జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కార్యకర్త దగ్గరి నుండి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈరోజు శుక్రవారం యూసుఫ్‌గూడా డివిజన్‌లో ఉపఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీ క్రికెటర్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజహరుద్దీన్, ఎఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మహిళా కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షురాలు సునీతారావు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరందరూ యూసుఫ్‌గూడా ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో భేటీ అయ్యి తమ పార్టీ పథకాలను వివరిస్తూ ప్రజల మద్దతు కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు.
Gold : మావోయిస్టు డంపుల్లో పెద్ద ఎత్తున గోల్డ్?
ప్రచారంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా పేద కుటుంబాల కోసం తీసుకున్న “ఫైన్ రైస్ పంపిణీ” మరియు “కొత్త రేషన్ కార్డుల జారీ” పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు. ఈ పథకాల ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందించడమే లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, ఈ ఉపఎన్నికలో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని విజయం సాధింపజేయాలని పిలుపునిచ్చారు.
Jio Users: జియో నుండి బంపర్ ఆఫర్.. 18 నెలలు ఉచితం!
యూసుఫ్‌గూడా ప్రాంత ప్రజలు కూడా ఈ బృందానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసిన నేతలకు స్థానికులు చప్పట్లతో, నినాదాలతో హర్షధ్వానాలు చేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సమస్యలను నేతలతో పంచుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన “సహజంగా సానుకూలంగా” ఉందని నేతలు తెలిపారు. ఈ ఉపఎన్నికలో ప్రజలు ప్రభుత్వ పథకాలపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి మరోసారి గెలుపు కిరీటం అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Myself, Minister @Ponnam_INC, @azharflicks, AICC Secretary Sampath, Mahila Congress President @SunithaRao_M, & local leaders did extensive door to door campaign in Yousufguda division in Jubilee Hills constituency for the by election.
The response from the general public was… pic.twitter.com/YovM6KAclo
— Uttam Kumar Reddy (@UttamINC) October 30, 2025

